YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీసీలకు కల్యాణ లక్ష్మీ నిధులు విడుదల చేయాలి.  

బీసీలకు కల్యాణ లక్ష్మీ నిధులు విడుదల చేయాలి.  

బీసీలకు కల్యాణ లక్ష్మీ నిధులు విడుదల చేయాలి.                       
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల నాగరాజు
జగిత్యాల జూన్ 24 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కల్యాణ లక్ష్మీ కి సంబంధించిన నిధులు 2019, 2020 సంబంధించినవి నేటికీ విడుదల చేయకపోవడం శోచనీయమని ,వెంటనే నిధులు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల నాగరాజు ఆన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఎన్నికల ప్రచార సభలో బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని,  బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చినారని గుర్తు చేశారు.రాష్ట్రంలో 60 శాతం జనాభా కలిగి ఉన్న బీసీలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మీ పథకం కింద  రావాల్సిన ఆర్థిక సహాయం ప్రభుత్వం నేటికీ అందించకపోవడం వల్ల బీసీ వధూవరులు చాలా క్షోభకు గురి అవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం వారి కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు అవుతుందన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం కింద జగిత్యాల జిల్లాకు 2019-2020 సంవత్సరానికి బీసీలకు రావాల్సిన నిధులు ఇంత వరకు విడుదల కాలేదని, దాదాపుగా 2,300 మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయిని.వెంటనే ప్రభుత్వం స్పందించి  నిధులు విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఓరుగంటి భార్గవ్ రామ్, గంగాధర్, నరేష్, సిరిపురం నిరంజన్, గుగ్గిళ్ళ సత్యనారాయణ, ఎనగంటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు .
 

Related Posts