YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గిరిజన ప్రాంతాల్లో విద్య,వైద్యం,తాగునీరు,రహదారుల కల్పనపై ప్రత్యేక దృష్టి

గిరిజన ప్రాంతాల్లో విద్య,వైద్యం,తాగునీరు,రహదారుల కల్పనపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలోని వివిధ గిరిజన ప్రాంతాల్లో విద్య,వైద్యం,తాగునీరు, రహదారుల కల్పనలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు.ట్రైబల్ రిఫార్మ్స్ యార్డిస్టిక్స్ అనే అంశంపై బుధవారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు,సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద మంజూరు చేసిన పనులు అనుకున్నంత వేగవంతంగా జరగడం లేదని ఆయా పనులు వేగవతంగా జరిగేలా చూడాలని పిఓలను ఆదేశించారు.ఈపధకం అమలుకు సంబంధించి జిల్లా కలక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చినందున పిఎంజిఎస్ వై పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు.ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్య,వైద్య సేవలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడడం తోపాటు తాగునీరు,రహదారులు వంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు పిఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులుగా యువ అధికారులను నియమించినందున అదొక మంచి అవకాశంగా భావించి గిరిజనులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలను మెరుగుపర్చడంతోపాటు వారి జీవన ప్రమాణాలను అన్ని విధాలా మెరుగుపర్చేందుకు పిఓలు అన్ని విధాలా కృషి చేయాలని సిఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి వసతి కల్పనకు తీసుకుంటున్నచర్యలను ఆయన సమీక్షిస్తూ రీచార్జి స్ట్రక్చర్లతో కూడిన బోర్ బావులను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మిషన్ మోడ్ తో పనిచేయాలని సిఎస్ ఆశాఖ అధికారులను ఆదేశించారు.సిసి రోడ్ల నిర్మాణానికి అవసరమైన డేటాబేస్ ను సేకరించి ఆప్రకారం అవసరమైన ప్రాంతాల్లో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు.అలాగే 2వేల జనభా దాటిన ప్రతి గిరిజన ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.అంతేగాక సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ నిర్వహణకు సంబంధించి 1000 జనాభా దాటిన ప్రతి గ్రామంలో సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ యూనిట్ ఏర్పాటు కు తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలుకు కృషి చేయాలని ఆదేశించారు. విద్యాభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్షిస్తూ ప్రాధమిక,ప్రాధమికోన్నత పాఠశాలల స్థాయిలో విద్యార్దుల డ్రాప్ అవుట్ రేట్ అధికంగా ఉందని ఆపరిస్థితిని నివారించేందుకు కృషి చేయాలని సిఎస్ చెప్పారు.ప్రతి గిరిజన విద్యార్ధికి బేసిక్ విద్యను పూర్తిగా అందించేందుకు ప్రాధమిక,ప్రాధమికోన్నత పాఠశాల స్థాయి నుండి నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని విధాలా కృషి చేయాలని సూచించారు.ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షిస్తూ గిరిజన ప్రాంతాల్లో రక్తహీణత,పౌష్టికాహార లోపానికి సంబంధిచిన 54 మండలాలను గుర్తించడం జరిగిందని ఆయా మండలాల్లో అదనపు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా ఈపరిస్థితిని మెరుగు పర్చేందుకు కృషి చేయాలన్నారు.పర్యవేక్షణకు ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారిని నోడలు అధికారిగా నియమించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గిరిజిన ప్రాంతాల్లో నెట్ వర్కు సౌకర్యం కల్పనపై ఎపి ఫైబర్ నెట్ ప్రతినిధి సమాధానం ఇస్తూ గిరిజన ప్రాంతంలోని 3వేల366 గ్రామ పంచాయితీలు,11వేల 789 ఆవాసాలకు ఫైబర్ నెట్ సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను వచ్చే మార్చి నాటికి పూర్తి చేయనున్నట్టు తెలిపారు.అనంతరం గిరిజన ప్రాంతంలోని వివిధ ఆశ్రమ పాఠశాలల తదితర వాటికి సాంప్రదాయేతర ఇంధన సౌకర్యం కింద విద్యుత్ సరఫరా అంశంపై సిఎస్ దినేష్ కుమార్ సమీక్షించారు. ఈసమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,తాగునీరు,పారిశుద్ద్యం శాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు,స్త్రీశిశు సంక్షేమశాఖ ప్రత్యేక కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్, గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు జి.చంద్రుడు,పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సంధ్యారాణి,ఐటిడిఏ ప్రాజెక్టులు అధికారులు,ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts