ఆర్ కె నగర్ లో అక్రమ నిర్మాణం కూల్చివేత
మల్కాజిగిరి, జూన్ 24
మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఖలిలుద్దిన్ హెచ్చరించారు. బుధవారం సర్కిల్ పరిధిలోని ఆర్కె నగర్ ప్రాంతంలో అనుమతులకు వ్యతిరేకంగా స్టీల్ టు ,అదనపు అంతస్తులో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారి సమక్షంలో సిబ్బంది కూల్చి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ దారులు జిహెచ్ఎంసి నుంచి పొందిన అనుమతుల మేరకే నిర్మాణాలు చేపట్టాలని కోరారు.నిబందలను అతిక్రమించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడి తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పలుకుబడి నీ ఉపయోగించి ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేపట్టే వారి పై చట్టరీత్య చర్య తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమములో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కృష్ణమూర్తి,చైన్ మెన్ రాఫాత్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.