YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 జగన్ బాటలో లోకేష్...

 జగన్ బాటలో లోకేష్...

 జగన్ బాటలో లోకేష్...
విజయవాడ, జూన్ 25 
జగన్ ది ఇపుడు సక్సెస్ ఫార్ములా. జగన్ ని అనుసరిస్తే విజయం వరించి వస్తుందని ఒక ఊహ, అంచనా, గుడ్డి నమ్మకం కూడా. అయితే విజయానికి ఎపుడూ దగ్గరదారులు లేవు. పైగా అది ఒకరిలా ఉండదు, ఒకరి దక్కిన విజయం మరొకరికి దక్కాలనీ లేదు. కానీ వర్తమాన రాజకీయాల్లో జగన్ పొలిటికల్ ఒక ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు. సరికొత్త ట్రేడ్ మార్క్ గా కూడా నిలిచారు. జగన్ బ్రాండ్ అన్నది పొలిటికల్ గా ఇపుడు బాగా వర్కౌట్ అవుతోంది. అదెలా అంటే అయిన వారి మీద చల్లని చూపులు, కానీ వారి మీద కఠినమైన నిర్ణయాలు. అంటే ఒకే వ్యక్తికే రెండు విభిన్నమైన షేడ్స్. ఒక కన్ను కరుణ అయితే మరో కన్ను కఠినం. ఇలా జగన్ ప్రజలకు తన కరుణను చూపుతూనే ప్రత్యర్ధులకు మాత్రం అరవీరభయంకరుడైపోతారు.జగన్ కి బాగా కలసివచ్చినది, ఆయనకు అసలైన బలమైనది దూకుడు. ఇప్పటితరం బాగా నచ్చుకుంటున్నది కూడా అదే. జగన్ ఎటువంటి జంకూ గొంకూ లేకుండా దూసుకుపోతారు. కుండబద్దలు కొడతారు. దూకుడుగా రాజకీయం చేస్తారు. తనకు నచ్చిన వారి విషయంలోనూ, నచ్చని వారి విషయంలోనూ జగన్ తీరు ఇలాగే ఉంటుంది. వేగంగా స్పందించి అదుకున్న చేతులతోనే అంతే వేగంగా అరదండాలు వేయించే సామర్ధ్యం జగన్ సొంతం. ఇలా రాజకీయంగా చూసుకున్నపుడు జగన్ ఒక దూకుడు అని అంతా అంటారు. ఇపుడు జగన్ ని అనుసరించాలని తమిళనాట సినీ హీరో విజయ్ వంటి వారు కూడా ట్రై చేస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే లోకేష్ ఇపుడు తండ్రి చంద్రబాబు బాట వదిలి జగన్ రూట్లోకి వస్తున్నారుట.వడ్డీతో సహా మేము మూల్యం చెల్లిస్తాం, ఇంతకు ఇంతా బుద్ధి చెబుతాం, విపక్షంలో ఉన్నపుడు జగన్ చేసిన సింహ గర్జన అది. జగన్ ని విశాఖ విమానాశ్రయంలో అరెస్ట్ చేసినపుడు ఆయన పోలీసులతో అన్న మాటలు ఇవి. గట్టిగా రెండేళ్ళు సమయం లేదు, వచ్చేది మా సర్కారే. అందరికీ గుర్తుపెట్టుకుంటాను, అన్నింటినీ బదులు తీర్చుకుంటాను అంటూ జగన్ మార్క్ పొలిటికల్ స్టైల్ చూపించారు. దాని వల్ల పార్టీ శ్రేణులకు కొండంత ధైర్యం, ప్రత్యర్ధులకు ఒక హెచ్చరిక, జనాలకు తమ పార్టీయే పవర్లోకి వచ్చేదని సంకేతం. ఇలా జగన్ మార్క్ దూకుడు ఇది. దీన్ని బట్టీ పట్టినట్లుగా అనంతపురం టూర్ల లోకేష్ బాబు గర్జించారు. మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేష్ లో ఈ యాంగ్రీ మాన్ బయటకు వచ్చాడు. అంతకు ముందు ఎపుడూ చూడని రూపమది. పైగా ఇంతకు ఇంతా బదులు తీరుస్తామని చెప్పడం ద్వారా భారీ డైలాగులతో పార్టీకి ఒక అభయం, భరోసా ఇచ్చారు.ఎవరి బాడీ లాంగ్వేజికి తగినట్లుగా వారి యాక్షన్ ఉంటేనే బాగుంటుంది. ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన బ్యాక్ గ్రౌండ్ వేరు. ఆయన తండ్రి చాటు బిడ్డగా రాజకీయ ప్రవేశం చేసిన మిగిలింది అంతా ఆయన స్వార్జితం, ఆయన దెబ్బ తిన్న పులి, పదేళ్ళ పాటు పోరాటాలు చేసి చేసి పదును తేరారు. అందుకే ఆయన నోట మాటలు కాదు, నిప్పులే వచ్చేవి. ప్రత్యర్ధులను తూర్పార పట్టేవి. లోకేష్ అలా కాదు, ఆయనది గోల్డెన్ స్పూన్ పాలిటిక్స్ పైగా చంద్రబాబు ప్రభావం పూర్తిగా ఉంది. ఇక పార్టీలో లోకేష్ సర్వాధికారి కాదు, అలాగే లోకేష్ దూకుడు తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉంటుందని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఎపుడైనా, ఏదైనా కూడా నేర్చుకోవచ్చు, స్పూర్తి పొందవచ్చు. జగన్ లోని ఆ ఎమోషన్ ని లోకేష్ కూడా తీసుకుని ప్రజల తరఫున పోరాడాలి, భారీ డైలాగులకు ముందు జనం మనసు గెలవాలి. అలా జరగాలంటే చాలా చేయాలి. మరి లోకేష్ దానికి సిధ్ధమేనా.

Related Posts