YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాకిస్థాన్ రాజ‌ధానిలో తొలిసారి హిందూ దేవ‌త‌ల ఆల‌య నిర్మాణం  

పాకిస్థాన్ రాజ‌ధానిలో తొలిసారి హిందూ దేవ‌త‌ల ఆల‌య నిర్మాణం  

పాకిస్థాన్ రాజ‌ధానిలో తొలిసారి హిందూ దేవ‌త‌ల ఆల‌య నిర్మాణం  
న్యూ ఢిల్లీ జూన్ 25
పాకిస్థాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్‌లో తొలిసారి హిందూ దేవ‌త‌ల ఆల‌యాన్ని నిర్మించ‌నున్నారు.  ప‌ది కోట్ల ఖ‌ర్చుతో ఆ ఆల‌య నిర్మాణం సాగ‌నున్న‌ది.  రాజ‌ధానిలోని హెచ్‌-9 ప్రాంతంలో సుమారు 20 వేల చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లంలో  శ్రీ కృష్ణ మందిర్ ఆల‌య నిర్మాణం  కోసం ఇవాళ శంకుస్థాప‌న చేశారు. పాక్ పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శి లాల్ చంద్ మ‌ల్హీ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఇస్లామాబాద్‌లో 1947కు ముందు క‌ట్టిన అనేక హిందూ ఆల‌యాలు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే ఆ పురాత‌న ఆల‌యాల‌ను ప్ర‌స్తుతం వాడ‌డం లేద‌న్నారు.ఆల‌య నిర్మాణం కోసం కావాల్సిన ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని మ‌త వ్య‌వ‌హారాల శాఖా మంత్రి పీర్ నూరుల్ హ‌క్ ఖాద్రి తెలిపారు. ప్ర‌స్తుతం ప‌ది కోట్ల టార్గెట్‌తో ఆల‌య నిర్మాణం మొద‌లుపెట్టామ‌న్నారు. ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అనుమ‌తితోనే ఆల‌య నిర్మాణం ప్రారంభించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  ఇస్లామాబాద్‌లో ఉన్న హిందూ పంచాయ‌త్.. కొత్త ఆల‌యానికి శ్రీ కృష్ణ మందిర్ అని పేరు పెట్టింది.  ఆల‌యం నిర్మిస్తున్న స్థ‌లాన్ని క్యాపిట‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ .. 2017లో హిందూ పంచాయ‌త్‌కు అప్ప‌గించింది. ఆల‌యం స‌మీపంలో హిందూ శ్మ‌శాన‌వాటిక‌ను కూడా నిర్మించ‌నున్నారు. 
 

Related Posts