శ్రీశైలంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
కర్నూలు జూన్ 25
శ్రీశైలం మహా కుంభకోణం సంబంధించి అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో శ్రీశైలంలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారితో పాటు నలుగురు తో కూడిన బృందం, కుంభకోణం సంబంధించిన శ్రీశైలం అవినీతి అక్రమాల నిధుల దుర్వినియోగంపై తనిఖీలు ముమ్మరం చేసింది. స్థానిక శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శ్రీశైలం కుంభకోణం సంబంధించి నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకుంది. కుంభకోణం కేసులో అరెస్టయిన 31 మంది శాశ్వత, అవుటం సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను స్థితిగతులను ఏసీబీ అధికారులు గోప్యంగా తెలుసుకుంటున్నారు. ఏసీబీ విచారణ మొదలు కావడంతో కొంతమంది శాశ్వత ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏసీబీ విచారణలో భాగంగా మరికొన్ని పెద్ద చేపలు బయటపడే అవకాశం వుందని సమాచారం