2017-18 లో వ్యవసాయం లో 17.76 శాతం వృద్ధిరేటు సాధించాం. పంటల ధరల స్థిరీకరణకు బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నాడుఅయన గుంటూరులో ఆంధ్రప్రదేశ్ కరువు సంసిద్ధత పథకం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఐదు కరువు జిల్లాల్లో రైతుల జీవన ప్రమాణాలు పెంచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని అన్నారు. 105 మండలాల్లోని 315 గ్రామ పంచాయితీల్లో 1.65 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ధరలు తగ్గకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోని రైతులను ఆదుకుంటుంది. 268 కోట్లతో రూ.4 లక్షల టన్నుల సామర్ధ్యం గల గోదాములు నిర్మాణాలు చేస్తామని అన్నారు. అలాగే, నకిలీ, కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపామని అన్నారు.