YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అప్పను సైడ్ చేసేస్తారా...

అప్పను సైడ్ చేసేస్తారా...

అప్పను సైడ్ చేసేస్తారా...
బెంగళూర్, జూన్ 25
యడ్యూరప్ప కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ లీడర్. ఒక రకంగా చెప్పాలంటే యడ్యూరప్ప లేకుంటే కన్నడ నాట బీజేపీ లేదనే అంటారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి యడ్యూరప్ప పేరే విన్పిస్తుంది. మరో పేరు విన్పించదు. అంతగా బీజేపీ అంటేనే యడ్యూరప్ప… .యడ్యూరప్ప అంటేనే బీజేపీ లా కర్ణాటకలో మారిపోయింది. అయితే ఇది ఒకప్పుడు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యడ్యూరప్ప కు త్వరలోనే బీజేపీ అధినాయకత్వం ఝలక్ ఇస్తుందంటున్నారు.యడ్యూరప్ప బీజేపీని అనేకసార్లు అధికారంలోకి తెచ్చారు. కర్ణాటకలో అధికారంలోకి బీజేపీ రావడం వల్లనే దక్షిణాదిన బీజేపీ ఉందనేది తెలిసిందన్నది వాస్తవం. అయితే మోదీ, అమిత్ షాలు వచ్చిన తర్వాత ఈ గీతలను చెరిపేశారు. వారి నాయకత్వంపై నమ్మకంతోనే రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా వచ్చినా అధికారంలోకి రాలేకపోయింది.అధిష్టానానికి యడ్యూరప్ప రాంగ్ సమాచారం ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ లు కలవడంతో ఆయన పదవి ఒకరోజుకే పరిమితమయింది. అప్పటి నుంచి మోదీ, షా ల వద్ద యడ్యూరప్ప పరపతి పడిపోయిందంటారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ శాసనసభ్యులందరినీ పార్టీలోకి రప్పించి గెలిపించుకోవడంతో యడ్యూరప్ప పదవి పదిలమే అనుకున్నారు. కానీ ఇప్పటికే ఆయన 70 ఏళ్ల వయసు దాటిపోయారు. ఆయన కుమారుడు రాఘవేంద్ర జోక్యం పాలనలో పెరిగిందంటున్నారు.అందుకే ఇటీవల రాజ్యసభ, విధానసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కూడా యడ్యూరప్ప జోక్యం లేకుండానే జరిగింది. ఇది ఆయనకు అవమానకరమే. అప్పటి నుంచే యడ్యూరప్ప ను పదవి నుంచి తొలగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కొత్త నేత నేతృత్వంలో జరుగుతాయని బీజేపీ కీలకనేతలే చెబుతుండటం విశేషం. దీంతో యడ్యూరప్పను 2021లో యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి కొత్త నేతను ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

Related Posts