రైతుల్లో పేరుకుపోయిన నిరాశా నిస్పృహల ప్రభావం వచ్చే ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అనిశ్చితి వాతావరణంలో వ్యవసాయురంగంలో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని వాతావరణ మార్పులకు అంటకడుతూ, మరింత దారుణస్థితిని ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. వ్యవసాయురంగం ఇక్కట్ల పరిస్థితిల్లోనే ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వ్యవసాయ రుణాలు చెల్లించడంలో అశక్తులైన రైతుల ఆత్మహత్యల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలో నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. 2015లో 8,007 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో ప్రతి పదిమందిలో నలుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అదే 2014 విషయానికొస్తే ప్రతి పదిమందిలోనూ ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత 11 ఏళ్ళుగా గ్రామీణ ప్రాం తాల్లో రైతులపై రుణభారం పెరిగిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ గుజరాత్‌లో బీజేపీ 16 స్థానాలు కోల్పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. దీన్నిబట్టి గ్రామీణ ఆర్థికవ్యవస్థలో ఏ మేరకు అశాంతి నెలకొనివుందో అర్థంచేసుకోవచ్చు. ఈ ఏడాది మరో ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఎక్కువ బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ రుణభారమెంత పెరిగిందో, ఆత్మహత్యలు, నిరాశ నిస్పృహలు ఏ మేరకు పేరుకుపోయి వున్నాయో పరిశీలించాల్సి ఉంది.
2014 కంటే 2015లో రైతుల ఆత్మహత్యలు 41.7 శాతం పెరిగాయి. జాతీయ క్రైమ్ రికార్డుల ప్రకారం, 2014లో రుణాలు తీసుకున్న రైతుల్లో 20.6 శాతం మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2013లో గ్రామీణప్రాంతాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు అప్పుల పాలయ్యారు. 2002 కంటే ఈ సంఖ్య 26.5 శాతం ఎక్కువ. 2013లో గ్రామీణ రుణభారం సుమారు 1.03 లక్షల (ప్రతి ఒక రైతుకు) రూపాయులుగా ఉన్నది. అంటే, ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 మోటారు సైకిలు ధరతో (1.09 లక్షల రూపాయులు) ఒక్కొక్కరి రుణభారం సమానం అన్నమాట. ఇదే ఐఫోన్ ధర 1.02 లక్షలు, పానాసోనిక్ 55 అంగుళాల ఫ్లాట్ స్క్రీన్ టీవీ 0.99 లక్షల రూపాయలు పలుకుతున్న విషయం తెలిసిందే. ఇది గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 833 మిలియన్ల మంది నివశిస్తున్నారు. మొత్తం జనాభాలో ఇది 68.8 శాతం. వీరిలో అత్యధికులు పేదలే. 2013 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీ య, గ్రామీణ బ్యాంకులు, బీమా కంపెనీలు 56 శా తం రుణాలు అందించాయి. మిగిలిన రుణాలు సంస్థాగతం కాని సంస్థైలెన మనీలెండర్స్, స్నేహితులు అందించేవి. రుణభారంతో కుంగిపోయి 2015 లో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో (మొత్తం 3,097 మంది) ఎక్కువ మంది (1,293 మంది) మహారాష్ట్రకు చెందినవారే ఉన్నారు. మొత్తం ఆత్మహత్యల్లో వీరి శాతం 41.7గా ఉన్నది. ఆ తరువాత స్థానం కర్ణాటక ఆక్రమించింది. 946 మంది ఆ రాష్ట్రంలో (30.5 శాతం) ఆత్మహత్యలకు పాల్పడగా, తరువాతి స్థానం తెలంగాణ (632 మంది - 20.4 శాతం) ఆక్రమించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చివుబెంగాల్, ఒడిశా రాష్ట్రాల రైతులు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో చిన్నకారు రైతులు (హెక్టార్ భూమి ఉన్నవారు) అప్పుల ఊబిలో మునిగిపోయి ఉన్నారు. పంట దిగుబడి సరిగాలేకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చేసిన అప్పులు తీర్చలేక మళ్లీమళ్లీ అప్పులు చేయుడం వంటి వాటివల్ల ప్రైవేట్ రంగం, ప్రభుత్వరంగం నుంచి రెండురంగాల నుంచి రైతులు అప్పులు అందుకున్నారు.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ప్రధాన భూమిక పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 123.6 మిలియున్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తున్నారని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఈ జనాభా ప్రస్తుతం మెక్సికో (ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 11వ దేశం) జనాభాతో సమానం. ఈ మూడు రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధి క్షీణించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల్లో పంటల ధర లు తగ్గిపోయి, రుణాలు రద్దుచేయాలని రైతులు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం మాత్రం అధిక ధరలు కల్పిస్తామని హామీలిచ్చి రైతులను బుజ్జగించే యుత్నాలకు దిగిందని 2017 డిసెంబర్‌లో ఒక ఆంగ్ల పత్రిక పేర్కొన్నది. రుణాలు చెల్లించలేక, వ్యవసా యం గిట్టుబాటుగా కనిపించక పోవడంతో రైతులు నిరాశ నిస్పృహల మధ్య ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
గ్రామీణ రంగంలో ప్రధాన రుణ వనరు అయిన ప్రైవేట్ వ్యక్తుల నుంచి 2013లో 28.6 శాతం మంది రైతులు రుణసాయం పొందారు. అదే 2002లో 19.6 శాతం రైతులు ప్రైవేట్ రుణాలు పొందారు. ప్రభుత్వ రంగ సంస్థల కంటే ప్రైవేట్‌రంగ సంస్థల నుంచి రు ణం పొందటం, తక్కువ సవుయంలో రుణం లభిం చడం వంటి కారణాలతో ప్రభుత్వం రంగ బ్యాంకులపై కంటే ప్రైవేట్‌రంగ సంస్థలపైనే ఎక్కువమంది రైతులు ఆధారపడుతున్నారని 2013లో రిజర్వ్‌బ్యాంక్ నివేదిక తెలియుజే స్తోంది. వడ్డీరేట్లు ఎక్కువైనా ప్రైవేట్‌రంగంపైనే రైతులు ఎక్కువభాగం ఆధారపడి ఉన్నారు. 2017లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు 36,359 కోట్లు, 30,000 కోట్ల రూపాయల మేర రైతురుణమాఫీని ప్రకటించాయి. అయితే, ప్రభుత్వరంగ సంస్థల నుంచి రుణంపొందిన వారే ఈ మాఫీకి అర్హులు కావడంతో చాలా తక్కువ మంది లబ్ధిపొందారు. 2016 మార్చి నాటికి వ్యవసాయ రంగంలో 51,964 కోట్ల రూపాయులున్న నిరర్ధక ఆస్తుల విలువ తరువాతి కాలంలో 20 శాతం పెరిగి 62,307 కోట్ల రూపాయులకు చేరుకున్నది. మంచి వ్యవసాయ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆదాయం మాత్రం తగువిధంగా పెరగకపోవడం వ్యవసాయు రుణాలకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.