YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 ఒక్క రోజే 17 వేలు దాటిన కరోనా కేసులు

 ఒక్క రోజే 17 వేలు దాటిన కరోనా కేసులు

 ఒక్క రోజే 17 వేలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ, జూన్ 25,
శవ్యాప్తంగా 4.73 లక్షల మందికి వైరస్ నిర్ధారణ కాగా.. వీరిలో 2.71 లక్షల మంది కోలుకున్నారు. మరో 1.86 లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం మహారాష్ట్రలో అత్యధికంగా 3,890 కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 3,788, తమిళనాడు 2,856, తెలంగాణ 891, ఉత్తరప్రదేశ్ 700, గుజరాత్ 572, ఆంధ్రప్రదేశ్ 497, హరియాణా 490, బెంగాల్ 445, అసోం 429 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మొత్తం 17,156 కొత్త కేసులు నమోదుకావడంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4.73 లక్షల దాటింది. కేవలం నాలుగు రోజుల్లోనే పాజిటివ్ కేసులు 4 లక్షల నుంచి 4.73 లక్షలకు చేరాయి.మహారాష్ట్రలో మరో 208 మంది మృత్యువాతపడ్డారు. దేశం నిన్న నమోదైన కరోనా మరణాల్లో సగం అక్కడే చోటుచేసుకున్నాయి. తర్వాత ఢిల్లీ (64), తమిళనాడు (33), గుజరాత్ (25), కర్ణాటక (14), ఆంధ్రప్రదేశ్ (10) ఉన్నాయి. దీంతో మొత్తం కరోనా మరణాలు 14,906కి చేరాయి. ముంబయి నగరంలో మరో 1,118 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. అలాగే మరో 120 మంది ప్రాణాలు కోల్పోగా.. అక్కడ మొత్తం కరోనా మరణాలు 3,964కి చేరాయి. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 1,42,900కి చేరగా.. 6,739 మంది ప్రాణాలు కోల్పోయారు.తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ పాజిటివ్ కేసులు 10వేల దాటాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో అత్యధికంగా 497 కేసులు నమోదు కాగా 10 మంది మరణించారు. చనిపోయిన వారిలో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఓ ప్రైవేటు వైద్యుడు ఉన్నారు. కొత్త వాటిని కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసులు 10,331కు చేరాయి. తెలంగాణలోనూ కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 891 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గత వారంరోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండడం గమనార్హం.తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,468కి చేరగా.. వీరిలో 37వేల మందికిపైగా కోలుకున్నారు. మరో 28,836 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 866 మరణాలు చోటుచేసుకున్నాయి. చెన్నై నగరంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. ముంబయి, ఢిల్లీ, తర్వాత ఇక్కడే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి

Related Posts