YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

శ్రీ రెడ్డి కి ఓయూ విద్యార్థి జేఏసీ మద్దతు

శ్రీ రెడ్డి కి ఓయూ విద్యార్థి జేఏసీ మద్దతు

శ్రీ రెడ్డి పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తోందంటూ కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం శ్రీ రెడ్డికి అండగా నిలుస్తున్నారు. తాజాగా బుదవారం హైదరాబాద్ ఓయూ విద్యార్థులు ఈమెకు మద్దతు తెలిపారు. శ్రీ రెడ్డిని ఓయూకి పిలిచి మరీ నీకు అండగా ఉంటాం అని తెలిపారు. ఈ సందర్బంగా ఓయూలో విలేకరులతో మాట్లాడిన శ్రీ రెడ్డి ఎమోషన్‌కి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. అన్నా.. ఓ తెలుగు ఆడబిడ్డ అన్యాయానికి గురైతే ఎవరూ ఊరుకోరంటూ ఈ రోజు మీరు ఓయూకు పిలిచి మరీ నాకు అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు అన్నా.. అంటూ కన్నీరు పెట్టుకుంది శ్రీ రెడ్డి. నేనొక్కదాన్నే కాదు అన్నా.. ఇంకా చాలామంది చెల్లెల్లు సినీ పెద్దల చేతుల్లో నలిగి పోతున్నారన్నా. మాకు సేఫ్టీ క్రియేట్ చేయండని మిమ్మల్ని వేడుకుంటున్నానన్నా.అంటూ ఓయూ విద్యార్థులను వేడుకుంది శ్రీ రెడ్డి.దీనిపై స్పందించిన ఓయూ విద్యార్థి జేఏసీ శ్రీరెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయంటూ గత కొద్దిరోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది శ్రీ రెడ్డి. టాలీవుడ్‌లో అవకాశాల పేరుతో లొంగదీసుకుని తెలుగు అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారంటూ తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది. తనతో సెలబ్రెటీలు జరిపిన ఛాట్ లిస్ట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న శ్రీరెడ్డి ఇటీవలే ఫిలిం చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉదంతంపై మా సభ్యులు తీవ్రంగా విరుచుకుపడుతూ శ్రీ రెడ్డితో మా సభ్యులెవరూ నటించకూడదని నిర్ణయించారు. దీంతో షాకైన శ్రీ రెడ్డి ఏమాత్రం జంకకుండా నేషనల్ మీడియాకు ఎక్కుతానంటూ సవాలు విసిరి తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది.

Related Posts