YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ విదేశీయం

స్వస్థలాలకు తరలిన బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణవాసులు

స్వస్థలాలకు తరలిన బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణవాసులు

స్వస్థలాలకు తరలిన బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణవాసులు
హైదరాబాద్  జూన్ 25, 
ప్రపంచవ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి విజృంభించడంతో అనేక దేశాలు లాక్ డౌన్ విధించాయి. అంతర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేశాయి. దీంతో అనేక దేశాల్లో లక్షలాదిగా భారతీయులు  చిక్కుకుపోయారు. ఇలా చిక్కుకుపోయిన భారతీయులను వందే భారత్ మిషన్ ద్వారా విమానాల్లో, ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా నౌకలలో స్వదేశానికి సురక్షితంగా తరలించారు.ఈ క్రమంలో బహ్రెయిన్ లో సుమారు 279 మంది తెలంగాణవాసులు చిక్కుకుపోయి తీవ్ర  ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు.  వీరిలో పిల్లలు, వృద్ధులు,  మహిళలు, ఉపాధి  కోసం వెళ్లి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు, టూరిస్టు వీసాల మీద వెళ్లిన వారు ఉన్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన బహ్రెయిన్ లోని ఇండియన్ క్లబ్ వారు మానవతా దృక్పథంతో వీరిని తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. అయితే వీరి విమానం ఇక్కడ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవడానికి అవసరమైన అనుమతులు జారీ కాలేదు. వారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి నుంచి పెద్దగా స్పందన రాలేదు. వారి సమస్య తీరలేదు. విమానం అందుబాటులో ఉండి, బహ్రెయిన్ లో కావాల్సిన ప్రక్రియ పూర్తయినప్పటికీ కేవలం ల్యాండింగ్ కు అవసరమైన అనుమతులు లేని కారణంగా వారు వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.వారు తమ దుస్థితిని భారతీయ జనతా పార్టీ గల్ఫ్ దేశాల ఎన్ఆర్ఐ కో ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ తోపల్లి  శ్రీనివాస్ దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి, దీనిని, భాజపా తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తో ఈ విషయం చర్చించారు. బండి సంజయ్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి  జైశంకర్ తో సంప్రదింపులు జరిపి, బహ్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలంగాణవాసుల అవస్థలు వివరించారు. వారి విమానానికి అవసరమైన అనుమతులు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి  చేశారు. బండిసంజయ్ కుమార్ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ విమానం ల్యాండింగ్ కు అవసరమైన అనుమతులు తక్షణమే జారీ చేసేలా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. అంతటితో ఆగకుండా బండి సంజయ్ కుమార్ విమానాశ్రయ, సంబంధిత అధికారులను సంప్రదించేలా పలువురిని పురమాయించగా, వారు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను సంప్రదిస్తూ అనుమతుల జారీ ప్రక్రియ వేగవంతమయ్యేలా చేశారు. దీంతో బెహ్రయిన్ లో చిక్కుకుపోయిన తెలంగాణవాసుల విమానానికి అనుమతులు చకచకా జారీ అయ్యాయి. 279 మంది తెలంగాణవాసులు ప్రత్యేక విమానంలో స్వదేశానికి బయలుదేరారు.తమ సమస్యపై  చొరవ చూపించి, వెంటనే కేంద్రమంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి, తక్షణమే తమ విమానం ల్యాండింగ్ కు అనుమతులు వచ్చేలా చేసిన బండి సంజయ్ కుమార్ కు, తోపల్లి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వివిధ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణవాసులు స్వస్థలాలకు రావడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గల్ఫ్ లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను తరలించేందుకు ఇక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తుంది. గల్ఫ్ లో ఉన్న లక్షన్నరకు పైగా తెలంగాణవాసులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు కేరళ తదితర రాష్ట్రాలు వందే భారత్ మిషన్ కింద విమానాలను ఏర్పాటు చేయించుకొని తమ వారిని స్వస్థలాలకు తరలిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమ పౌరుల పట్ల నేరమయ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సొంతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నవారికీ అవసరమైన సాయం చేసేందుకు నిరాకరిస్తోంది. ఇప్పటివరకు విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణవాసుల తరలింపు కేంద్ర ప్రభుత్వం, బిజెపి నాయకుల చొరవతోనే జరిగింది తప్పితే రాష్ట్ర ప్రభుత్వ కృషి లేకపోవడం గమనార్హం.
 

Related Posts