YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సింగరేణిలో మాజీ ఎంపీ కవిత రీఎంట్రీ

సింగరేణిలో మాజీ ఎంపీ కవిత రీఎంట్రీ

 సింగరేణిలో మాజీ ఎంపీ కవిత రీఎంట్రీ
కరీం నగర్ జూన్ 25
సింగరేణిలో మాజీ ఎంపీ కవిత రీఎంట్రీ ఇచ్చారు. దాదాపు 50 బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్రం మొగ్గుచూపుతన్న నేపథ్యంలో కార్మిక సంఘాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఆమె నడుం బిగించారు. దీనితో ఇప్పుడు ఈ ఉద్యమంలో మాజీ ఎంపీ కవిత కూడా పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై రేపు సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. వచ్చే నెల 2న సమ్మెకు టిబిజికేఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ అనుబంధ టిబిజికేఎస్ బలోపేతంపై కవిత దృష్టి సారించారు.కాగా ఇప్పటికే సింగరేణిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కొంతకాలంగా ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ టీబిజికేఎస్ బలోపేతంపై కవిత దృష్టి సారించారు. గతంలో ఈ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవిత… కొన్నాళ్ల క్రితం రాజీనామా చేశారు. కవితతో పాటు ఆర్టీసీ టీఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉన్నమంత్రి హరీష్ రావు కూడా అప్పట్లో పదవికి రాజీనామా చేశారు. టీఆర్ ఎస్ లో కీలక నేతలు కీలకమైన కార్మిక సంఘాల పదవులకు రాజీనామా చేయటం చర్చనీయాంశం అయ్యింది.కానీ ఇప్పుడు కార్మిక సంఘాల ఎన్నికలకు ముందు బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఉద్యమంలో గుర్తింపు పొందిన యూనియన్ గా ఉన్న టీఆర్ ఎస్ అనుబంధ సంస్థ టీజీబీకేఎస్ చురుకుగా వ్యవహరించాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే కవితను మరోసారి అక్కడికి పంపినట్లు తెలుస్తోంది. గతంలో పనిచేసిన అనుభవం పరిచయాలతో సంఘంపై ఉన్న అసంతృప్తిని కవిత అధిగమిస్తారని పార్టీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో 2 నుంచి మూడు రోజుల సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు కార్యాచరణను రూపొందించాయి.

Related Posts