బుధవారం నాడు ఢిల్లీలో జరిగిన ఎన్సీఈఆర్టీ 55 వ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి హజరయ్యారు. ఈ భేటీకి అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులు కుడా హజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ శిక్షణపై అధ్యయనానికి కమిటీ ని భేటీ ప్రతిపాదించింది. కమిటీ చైర్మన్ గా కడియం శ్రీహరిని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ నియమించారు. భేటీ వివరాలు కడియం శ్రీహరి మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యా శాఖ లో చేపడుతున్న పథకాలు, నూతన కార్యక్రమాలు, కేంద్రానికి పంపిన రాష్ట్ర ప్రతిపాదనలు వివరించాను. బాలికా విద్యపై సూచనలను కుడా కేంద్రానికి అందజేశానని అయన అన్నారు. కస్తుర్బా గాంధి బాలికల విద్యాలయాలను 12 తరగతి వరకు పొడిగించినందుకు కేంద్రానికి శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. కేజీబీవీలను 12 వ తరగతి వరకు పొడగించటం వల్ల బాల్య వివాహాలను అరికట్టి, బాలికల విద్య పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని అయన అన్నారు. ఎన్ సిఈఆర్ టికి తెలంగాణ తరపున అనేక సూచనలు చేశాం. దేశవ్యాప్తంగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించాలని కేంద్రాన్ని కోరాం. తెలంగాణాలో 12 వేల అంగన్ వాడీ కేంద్రాలలో స్కూల్స్ నిర్వహిస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ యూనిఫామ్స్ 12 వ తరగతి వరకు అందించేలా సహకారం ఇవ్వాలని కోరాం. సర్వశిక్షా అభియాన్, ఆర్.ఎమ్.ఎస్,ఎ టీచర్ ట్రైనింగ్ అన్ని కలిపి సమగ్ర శిక్షా అభియాన్ పధకం ఏర్పాటు చేస్తున్నామని కేంద్రానికి తెలిపాం. విద్యారంగానికి 20 శాతం బడ్జెట్ పెరిగింది. వచ్చే సంవత్సరం 20 శాతం నిధులు పెంచుతామని కేంద్రమంత్రి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో డైట్ (డిస్ట్రక్ట్ ఇన్స్టిట్యూషన్ ఆప్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్)సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరానని శ్రీహరి వివరించారు.