నర్సింగ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలి\
కర్నూలు జూన్ 25
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ఇంటర్ డిగ్రీ పీజి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు గా ప్రకటించడం జరిగింది అదే కోవలో నర్సింగ్ సప్లమెంటరీ పరీక్షలు రద్దు చేసి వారిని కూడా ఉత్తీర్ణులు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి తీవ్రతరం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల కట్టుదిట్టం చర్యలను చేయడం మంచి పరిణామం అన్నారు. దానిలో భాగంగానే నర్సింగ్ విద్యను అభ్యసించే విద్యార్థుల పరీక్షలు రద్దు చేసి వారిని కూడా ఉత్తీర్ణులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరీక్షలు నిర్వహించినట్లు అయితే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో నర్సింగ్ విద్యార్థులు మరలా ఒక చోట చేర్చడం అనేది కరోన వ్యాధికి కారణం అవుతుంది కాబట్టి కరోన వ్యాధి ని దృష్టిలో పెట్టుకొని ఇతర పరీక్షలకు ఏవిధంగా రద్దు చేశారు అదేవిధంగా నర్సింగ్ పరీక్షను రద్దు చేసి వారందరినీ ఉత్తీర్ణులు గా ప్రకటించాలన్నారు.