YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మనం రాజీ పడబోమని భాజపాకు అర్థమైనది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

మనం రాజీ పడబోమని భాజపాకు అర్థమైనది          ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం రాజీ పడబోమని భాజపాకు అర్థమైనందునే కేసులున్న వారిని చేరదీశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.వైకాపావి రాజీనామాలు కాదని, భాజపాతో రాజీపడి ప్రజలకు నామాలు పెట్టారని విమర్శించారు. తన మీద కక్షతో రాష్ట్రం మీద దాడి చేసే పరిస్థితికి భాజపా వచ్చిందని సీఎం మండిపడ్డారు. తెలుగుదేశం సహకారం లేకుంటే రాష్ట్రంలో భాజపా ఎక్కడుందని ప్రశ్నించారు. విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అలా చేరదీస్తే తమ చెప్పుచేతల్లో జగన్‌ ఉంటాడన్నది భాజపా ఎత్తుగడ అని వివరించారు. కక్ష సాధింపు కోసం అవినీతి పార్టీనిభాజపా అక్కున చేర్చుకుందన్న చంద్రబాబు ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. హక్కుల సాధన కోసం ప్రధాని ఇంటిని ముట్టడించిన ఘనత తెదేపా ఎంపీలదన్నారు. కర్ణాటక ఎన్నికల కోసం కావేరి బోర్డు వేయకుండా అన్నా డీఎంకేతో పార్లమెంట్‌లో గొడవ చేయించారని దుయ్యబట్టారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా మోదీ చేసిన వాగ్దానాలను తాము ప్రశ్నిస్తుంటే.. తామేదో తప్పు చేసినట్లు మోదీ దీక్ష చేస్తాననడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఎలాంటి త్యాగాలు, పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలవడమే మన లక్ష్యమన్న చంద్రబాబు అప్పుడే మన మాట వినే ప్రభుత్వం కేంద్రంలో వస్తుందన్నారు. తద్వారా ప్రత్యేక హోదా కూడా వస్తుందన్నారు.

Related Posts