YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతులను నట్టేట ముంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం...

రైతులను నట్టేట ముంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం...

రైతులను నట్టేట ముంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం...
"కల్వకుంట్ల కుటుంబ"అధికార పీఠం పదిలం కోసమే *రైతుబంధు
             ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి
హైదరాబాద్ జూన్ 25
రాష్ట్రంలో "కల్వకుంట్ల కుటుంబ"అధికార పీఠం పదిలం కోసం రైతుబంధు పేరిట రైతులను టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం నట్టేట ముంచుతున్నారని ఏఐసిసి కార్యదర్శి,కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు, గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలొచ్చినప్పుడల్లా ఓట్లు దండుకోవడం కోసం జిమ్మిక్కుల పథకాలు రూపొందించి పరోక్షంగా రైతుల ఓట్ల కోసం నోటులా రైతుబంధు  పథకాన్ని సృష్టించారని ఆయన పేర్కొన్నారు. రైతాంగాన్ని,రైతులను అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ సంవత్సరం వర్షాకాలనికి 5వ విడత 59 లక్షల 30 వేల మంది రైతులుంటే కేవలం 50 లక్షల 84 వేల మందికి రైతుబంధు డబ్బులను చెల్లించి చేతులు దులుపుకుని మిగతా 8 లక్షల 46 వేల మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఆయన ఆరోపించారు.రాష్ట్ర  ముఖ్యమంత్రి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా రైతు బంధు వర్తింపజేస్తామని  ఊకదంపుడు ఉపన్యాసల గాలి మాటలతో ఆచరణ సూత్రాన్ని మరిచిన టిఆర్ఎస్ ప్రభుత్వం దశల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడతలో 5 లక్షల 43 వేలు, 3వ విడతలో 5 లక్షల 21 వేలు, 4వ విడతలో ఏకంగా 17 లక్షల 80 వేలు 5వ విడతలో 8 లక్షల 46 వెలు, మొత్తం 36 లక్షల 90 వేల మంది రైతులకు డబ్బులు చెల్లించకుండా కుచ్చుటోపి పెట్టిందని ఆయన విమర్శించారు. మరో పక్క ప్రజలను,రైతాంగాన్ని మభ్య పెట్టేవిధంగా ఈ సంవత్సరం 5వ విడత రైతుబంధు పథకానికి 7000 కోట్లు అవసరమైతే...! కేవలం 5294 కోట్లు విడుదల చేసి 1706 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టిందని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రతి విడతలో కేటాయింపు చేస్తూనే మరోవైపు బుకాయింపుగా బకాయిలు పెడుతూనేవుందని ఆయన హెద్దేవా చేశారు. ఇప్పటి వరకు 2వ విడత రూ.1500 కోట్లు,3వ విడత రూ.1138 కోట్లు,4వ విడత రూ.3127 కోట్లు అదేవిధంగా దశలవారీగా  ఇప్పటివరకు మొత్తం రూ.7,471 కోట్లు బకాయిలు పెట్టి రైతుబంధు ఎలా...? పూర్తి అవుతుందో ముఖ్యమంత్రే ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆశించిన రైతులకు అందని ద్రాక్షలా రైతుబంధును చేసి మరోపక్క నిధుల కేటాయింపులో కోతలు పెడుతూ "మా ఇల్లు బంగారం కాను" అనే చందంగా రాష్ట్ర ఖజానాకు కెసిఆర్ కుటుంబం కన్నం వేసిందని ఆయన ఆరోపించారు.రాష్ట్రంలో అభివృద్ధి పేరిట అవినీతే ఎక్కువ జరుగుతుంది తప్పా ప్రజా సంక్షేమాభివృద్ధి జరగడం లేదని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి మానవ,సహాజ వనరులను కాజేసి తమ ఆస్తులు పెంచుకునే వనరుగా రాష్ట్రాన్ని మార్చుకున్నారని ఆయన ఆరోపించారు.ప్రశ్నించే ప్రతిపక్షాల నాయకులను,పాత్రికేయులను అరెస్టులు,బెదిరింపులకు గురిచేసిన ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ అక్రమాలను,దోపిడీలను నిగ్గుతేల్చే గొంతులు ఏకమైతే మీ ప్రభుత్వ పతనం ఖాయమని ఆయన హెచ్చరించారు.
 

Related Posts