YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టిఆర్ఎస్ పార్టీ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిక

టిఆర్ఎస్ పార్టీ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిక

టిఆర్ఎస్ పార్టీ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిక
ఎమ్మెల్సీ సమక్షంలో చేరిన ఉపసర్పంచ్
జగిత్యాల  జూన్ 25 జగిత్యాల జిల్లాలోని  చొప్పదండి నియోజకవర్గానికి చెందిన  ఓ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధి  కాంగ్రెస్ పార్టిలో చేరారు.
చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండలం తిప్పయ్యపల్లి ఉపసర్పంచ్  బాలరాజు గురువారం టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి , పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఈసందర్భంగా జీవన్ రెడ్డి ఉపసర్పంచ్ బాలరాజు కు  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడడమే గాకుండా  పార్టిలో అంకితభావంతో పనిచేస్తానని, జీవన్ రెడ్డి మార్గనిర్దేశకత్వంలో , మేడిపల్లి సత్యం నాయకత్వంలో  పనిచేస్తానన్నారు.

Related Posts