YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

వీర జవాన్లను స్మరిస్తూ కాంగ్రెస్ సలాం  పేరుతో 26న  మౌన దీక్ష

వీర జవాన్లను స్మరిస్తూ కాంగ్రెస్ సలాం  పేరుతో 26న  మౌన దీక్ష

వీర జవాన్లను స్మరిస్తూ కాంగ్రెస్ సలాం  పేరుతో 26న  మౌన దీక్ష
     డీసీసీ అధ్యక్షులతో, ముఖ్య నేతలతో ఉత్తమ్ వీడియో కన్ఫరెన్సు
హైదరాబాద్ జూన్ 25
చైనా,ఇండియా సరిహద్దులో జరిగిన పోరాటంలో చైనా ఘాతుకానికి బలైన 20 మంది వీర జవాన్లను స్మరిస్తూ అమర వీరులకు కాంగ్రెస్ సలాం అనే పేరుతో 26న  మౌన దీక్ష చేయాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి ప్రధాన కార్యదర్శి ఆర్.సి కుంటియాలు పిలుపునిచ్చారు.సిడబ్ల్యుసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల.మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ గారి లేఖలలో దేశ వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను  వివరించారు. ఈ రెండు కార్యక్రమాలను పూర్తి స్థాయిలో కరోనో నిబంధనలు పాటించాలని, భౌతిక దూరం, మాస్కలు ధరించి చేయాలని వారు సూచించారు..గురువారం నాడు డీసీసీ అధ్యక్షులతో ముఖ్య నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో కుంతియా, ఉత్తమ్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, వంశీ చందర్ రెడ్డి, సంపత్ కుమార్, టీపీసీసీ కార్య నిర్వహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, మల్లు రవి, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గోన్నారు.ఈ సందర్బంగా ఉత్తమ్, కుంటియాలు కాంగ్రెస్ నాయకులకు  పలు సూచనలు చేశారు. శుక్రవారం నాడు అన్ని జిల్లా, నియోజక వర్గ కేంద్రాలలో అమరవీరులకు కాంగ్రెస్ సలాం అనే పేరుతో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు మౌన దీక్ష చేయాలి. చైనా పై పోరాటంలో అమరులైన కల్నల్ సంతోష్ బాబు తోపాటు 20 మంది జవాన్లకు నివాళులు అర్పించాలి.   గాంధీ విగ్రహం దగ్గర కానీ, జాతీయ నేతల విగ్రహాల వద్ద కానీ జాతీయ జెండా ప్రదర్శిస్తూ,  ఈ మౌన దీక్షలు చేయాలి. అనంతరం చైనా భారత్ ను వదిలిపో అంటూ సోషల్ మీడియాలో స్పీకప్ కార్యక్రమాలు చేయాలి...అలాగే 29న సోమవారం నాడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపులను నిరసిస్తూ కాంగ్రెస్ ఆద్వర్యంలో అన్ని జిల్లా, నియోజక వర్గ కేంద్రాలలో రెండు గంటలపాటు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టరేట్ల వద్ద కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాన్ని సమర్పించాలని సూచించారు.28న పివి శత జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలి.మాజీ ఏఐసీసీ అధ్యక్షులు, మాజీ ప్రధాని, ప్రపంచ మేధావి, బహుభాషా కోవిదులు పివి నర్సింహారావు గారి శత జయంతి ఉత్సవాలను తెలంగాణలో ఘనంగా నిర్వహించాలని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన నాయకులనుద్దేశించి మాట్లాడుతూ అన్ని నియోజక, జిల్లా కేంద్రాలలో పివి నర్సింహారావు చిత్ర పటానికి, విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించాలని, పివి దేశానికి చేసిన సేవలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.

Related Posts