కల్నల్ సంతోష్ బాబు విగ్రహం రెడీ
సూర్యాపేట జూన్ 26
అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేట పాత బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం కల్నల్ కుటుంబానికి హామీ ఇచ్చింది.. ఈ నేపథ్యంలో విగ్రహా తయారీ బాధ్యతలను పశ్చిమ గోదావరి జిల్లా నత్తా రామేశ్వరానికి చెందిన శిల్పులకు అప్పగించారు.. శిల్పులు కల్నల్ విగ్రహాన్ని పూర్తి చేశారు.. ఈ వారంలోనే సూర్యాపేటకు పంపనున్నారు. అక్కడి చేరుకున్న వెంటనే మంత్రి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లు జరగనున్నాయి.