గుజరాత్ లో పనిమనిషిపై ఏడాదిన్నర అత్యాచారం
గాంధీనగర్, జూన్ 26
పనిమనిషిపై కన్నేశారు కామాంధులు. ఆశ్రమంలో పనులు చేసేందుకు తీసుకొచ్చి బలవంతంగా కామకోరికలు తీర్చుకుంటున్నారు. గదిలో బంధించి ఏడాదిగా గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. చివరికి..కామాంధులు రెచ్చిపోయారు. ఆశ్రమంలో పని కోసం వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడాదిన్నరగా ఆమెను గదిలో బంధించి ముగ్గురు మృగాళ్లు నిత్యం నరకం చూపించారు. తీరా విషయం బయటకి పొక్కడంతో నిందితులు కటకటాల పాలయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ గద్దల ముఠా ఎంటరైంది. ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని లక్షలు గుంజాలని ప్లాన్ చేసింది. సాయం చేస్తామని బాధితురాలికి చెప్పి నిందితులతో బేరం మాట్లాడేందుకు యత్నించి అడ్డంగా బుక్కైంది. ఈ దారుణ ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది.అహ్మదాబాద్‌కి సమీపంలోని బొటాడ్‌కు ప్రాంతానికి చెందిన మహిళ అమ్రేలీలో ఉన్న సత్ దేవీదాస్ ఆశ్రమంలో పనికి కుదిరింది. ఆమెపై కన్నేసిన ఆశ్రమ నిర్వాహకులు ముగ్గురు దారుణానికి పాల్పడ్డారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఒకరి తర్వాత మరొకరు దారుణంగా రేప్ చేశారు. పనిమనిషి ఏడాదిగా గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఆమెపై అనేక సార్లు అత్యాచారం చేసి హింసించారు. ఈ విషయం ఎలాగో బయటికి పొక్కడంతో దామ్‌నగర్ పోలీసులు ముగ్గురు నిందితులు రఘురామ్ భగత్, జగదీష్ భగత్, భవేష్ భగత్‌లను అరెస్టు చేశారు. నిందితులు స్వామీజీ భక్తులుగా చలామణీ అవుతూ ఆశ్రమంలో సభ్యులుగా చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని లక్షలు గుంజేందుకు ఓ ముఠా ఎన్జీవో పేరుతో గద్దలా వాలింది. బాధితురాలికి సాయం చేస్తామని నమ్మించి ఆమెను వీడియోలు తీసింది.అనంతరం వాటిని అడ్డుపెట్టుకుని నిందితులతో బేరసారాలు సాగించింది. ఆమెను అసభ్యకరంగా చిత్రీకరిస్తామని.. కేసులో నుంచి బయటపడేందుకు సాయం చేస్తామంటూ రూ.45 లక్షలు డిమాండ్ చేసింది. అందులో భాగంగా బాధితురాలి వ్యక్తిగత వీడియోలను ఆమె అనుమతి లేకుండా సోషల్ మీడియాలో వైరల్ చేసింది. డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారం పోలీసులకు తెలియడంతో వసూళ్లకు యత్నించిన ప్రవీణ్ రాథోడ్, రమేష్ మారు, జిగ్యేష్ మన్వర్‌ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.