విశాఖ, విజయవాడలల్లో సర్వీసులు
విజయవాడ, జూన్ 26
నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఒకే రేటు ఉండేలా ధరలను నిర్ణయించి సర్వీసులను నడపాలని చూస్తున్నది. కోవిడ్ మార్గదర్శలకు అనుగుణంగా సర్వీసులను నడపనున్నారువిజయవాడ, విశాఖవాసులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సిటీ సర్వీసుల్ని ప్రారంభించాలని నిర్ణయించింది. త్వరలోనే విజయవాడ, విశాఖలో సిటీ బస్సులను నడిపేందుకు ప్లాన్ చేస్తోంది. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఒకే రేటు ఉండేలా ధరలను నిర్ణయించి సర్వీసులను నడపాలని చూస్తున్నది. కోవిడ్ మార్గదర్శలకు అనుగుణంగా సర్వీసులను నడపనున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుని బస్సు సర్వీసుల్ని ప్రారంభించాలని భావిస్తున్నారు.కేంద్రం లాక్‌డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెడ్, కంటైన్మెంట్ జోన్ల మినహా జిల్లాల్లో బస్సులు తిరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర బస్సుల విషయానికి వస్తే కర్ణాటక, ఒడిశాకు బస్సులు నడుస్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ-ఏపీ మధ్య సర్వీసులపై సందిగ్థత కొనసాగుతోంది. ఈ నెలాఖరు నుంచి బస్సులు నడపాలని భావించినా ఆ దిశగా అడుగులు పడలేదు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి.హైదరాబాద్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగడటం, టీఎస్‌ఆర్టీసీలో ఆపరేషన్స్ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్ తేలడంతో చర్చల్ని వాయిదా వేశారు. ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చించారు. రెండో సమావేశంలో క్లారిటీ వస్తుందని భావించారు.. కానీ సీన్ మొత్తం మారింది.