5 జీపై ముఖేష్ కన్ను
ముంబై, జూన్ 26
ముకేశ్ అంబానీ దూకుడు పెంచారా? 5జీ నెట్‌వర్క్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారా? ఇటీవల సమీకరించిన నిధులలో కొంత భాగాన్ని 5జీ కోసం కేటాయించారా? ఇప్పటికే ల్యాబ్ టెస్టింగ్‌కు స్టార్ట్ చేశారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోందిదేశంలోనే అత్యంత ధనవంతుడు, దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ మానస పుత్రిక రిలయన్స్ జియో గురించి అందరికీ తెలుసు. జియో సృష్టించిన సంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఉచిత కాల్స్, చౌక ధరకే డేటా వ్యూహంతో జియో ఇప్పుడు ప్రతి ఒక్కరికీ చేరువైంది. సర్వీసులు ప్రారంభించిన మూడేళ్లలోనే టాప్ టెలికం కంపెనీగా ఆవిర్భవించింది.భారతీయులకు 4జీ నెట్‌వర్క్‌ను సుపరిచితం చేసిన టెలికం కంపెనీగా జియోకు ప్రత్యేక స్థానం ఉంది. 2జీ దగ్గరి నుంచి చాలా మంది 4జీకి వచ్చేశారు. దీనికి జియో, జియో ఫోన్స్ ప్రధాన కారణం. ఇప్పుడు జియో 5జీ నెట్‌వర్క్ సేవలను కూడా భారతీయులకు పరిచయం చేయాలని యోచిస్తోంది.రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 5జీ నెట్‌వర్క్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కంపెనీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మరోసారి స్పెక్ట్రమ్ వేలానికి రెడీ అవుతోంది. ఇలాంటి సందర్భంలో జియో కూడా 5జీ రెడీ నెట్‌వర్క్, ఫైబర్ అసెట్స్ ఎక్స్‌టెన్షన్ వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తోంది.జియో ఇప్పటికే 5జీ సర్వీసులు పరీక్షించడానికి ప్రభుత్వ అనుమతి కోరినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ల్యాబ్‌లో టెస్టింగ్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. టెలికం ఎక్విప్‌మెంట్ సంస్థలతో కలిసి టెలికం కంపెనీలు 5జీ సర్వీసులపై పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రిలయన్స్ జియో సొంతంగానే 5జీ నెట్‌వర్క్ అభివృద్ధిపై పనిచేస్తోందనే నివేదికలు కూడా వెలువడుతున్నాయి.