YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు విదేశీయం

క్రిస్ గేల్  కుమ్మేశాడు

క్రిస్ గేల్  కుమ్మేశాడు

క్రిస్ గేల్  కుమ్మేశాడు
ముంబై, జూన్ 26
ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా 2013 నుంచి క్రిస్‌గేల్ కొనసాగుతున్నాడు. పుణెతో జరిగిన మ్యాచ్‌లో గేల్ ఏకంగా 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.ఐపీఎల్‌లో డబుల్ సెంచరీ సాధించే అవకాశం 2013లో తనకి కొద్దిలో చేజారిందని వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ వెల్లడించాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి ఆడిన క్రిస్‌గేల్.. పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 66 బంతుల్లోనే 13x4, 17x6 సాయంతో 175 పరుగులు చేశాడు. అయితే.. ఆరోజు మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ (31: 8 బంతుల్లో 3x4, 3x6) ఆఖర్లో కొన్ని బంతులు ఆడటంతో తనకి డబుల్ సెంచరీ చేసే అవకాశం చేజారిందని క్రిస్‌గేల్ తాజాగా వెల్లడించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏప్రిల్ 23, 2013లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు.. క్రిస్‌గేల్ (175 నాటౌట్) జోరుతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 263 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన పుణె వారియర్స్ ఆఖరికి 133/9తో సరిపెట్టింది. క్రిస్‌గేల్‌కి ఆ మ్యాచ్‌‌లో మరికొన్ని బంతులు ఆడే అవకాశం దక్కింటే డబుల్ సెంచరీ సాధించేవాడేమో..? ఇదే విషయాన్ని గేల్ కూడా అంగీకరించాడు.‘‘ఆ మ్యాచ్‌లో ఫస్ట్ రెండు ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కాసేపు అంతరాయం కలిగించింది. దాంతో.. డ్రెస్సింగ్‌ రూములోకి వెళ్లిన నేను.. సహచర క్రికెటర్‌ రామ్‌పాల్‌తో ఒక మాట చెప్పాను. బ్యాటింగ్‌కి పిచ్‌ చాలా అనువుగా ఉంది.. కాబట్టి మ్యాచ్‌లో గెలవాలంటే టీమ్ కనీసం 170-180 పరుగులు చేయాలన్నాను. కానీ.. మ్యాచ్ ముగిసే సమయానికి నా ఒక్కడి స్కోరు 175 పరుగులు. ఆ మ్యాచ్‌లో డివిలియర్స్ ఆఖర్లో బ్యాటింగ్‌కి రాకుండా ఉండింటే.. నేను డబుల్ సెంచరీ అందుకునేవాడ్ని’’ అని క్రిస్‌గేల్ వెల్లడించాడు.

Related Posts