YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మాకు కరోనా పేషంట్స్ కావాలి

మాకు కరోనా పేషంట్స్ కావాలి

మాకు కరోనా పేషంట్స్ కావాలి
న్యూఢిల్లీ,జూన్ 25, 
కరోనా ఏవిధంగా తగ్గుతుందా అని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తుండగా.. జపాన్ మాత్రం వింత సమస్యతో బాధపడుతోంది. కొవిడ్ రోగులు లేక ఇబ్బంది పడుతోంది. అందుక్కారణం ఇదే..కరోనా వైరస్ ఎలా నశిస్తుందా అని ప్రపంచ దేశాలన్నీ తలలు పట్టుకుంటుండగా.. జపాన్‌కు మాత్రం కొత్త తలనొప్పి ఎదురైంది. కొవిడ్ రోగుల లేక ఆ దేశం తిప్పలు పడుతోంది. రోగులు లేకపోతే సంతోషించాలని గానీ.. బాధపడటం ఎందుకనేగా అనుమానం. అయితే.. దీనికి కారణం లేకపోలేదు. కరోనాకు వ్యాక్సిన్ రూపొందిండం కోసం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. జపాన్ కూడా ఈ పరిశోధనల్లో కీలక దశకు చేరుకుంది. అయితే.. అక్కడ కరోనా రోగులందరికీ నయం చేసి ఇంటికి పంపించారు. కొత్త కేసులు కూడా నమోదు కావడం లేదు. దీంతో క్లినికల్ ట్రయల్స్‌ కోసం రోగులు దొరకడం లేదు.కరోనా చికిత్స కోసం యాంటీ వైర‌ల్ ఔష‌ధం అవిగన్ (ఫవిపరవిర్) డ్రగ్‌పై జపాన్ ప్రస్తుతం పరిశోధన చేస్తోంది. ఈ డ్రగ్ సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించాల‌ని జపాన్ ప్రధాని షింజో అబే ఆదేశించ‌గా.. రోగులు లేక‌పోవ‌డంతో పరీక్షలు ఆల‌స్యం అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఔష‌ధాన్ని భార‌త్‌, ర‌ష్యా ఆమోదించాయి. జ‌పాన్‌కు మాత్రం ఎదురుచూపులే మిగిలాయి. విదేశాల్లో అవిగ‌న్‌ను ఆమోదం ల‌భించినా.. జ‌పాన్‌లో ల‌భించ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని అక్కడ ఫార్మా సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం జపాన్‌లో కొవిడ్‌-19కు సంబంధించి 54 క్లినిక‌ల్ ట్రయ‌ల్స్‌కు అనుమ‌తులు ఉండ‌గా.. ఇవన్నీ రోగుల పేర్లను న‌మోదు చేసుకొనే ద‌శ‌లోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. కరోనా మహమ్మారి ప్రభావానికి అగ్రరాజ్యం అమెరికా సహా, రష్యా, బ్రిటన్ తదితర దేశాలు కుదేలవుతున్నాయి. అయితే.. క‌రోనా వైర‌స్ ప్రభావం ప‌డ‌ని అభివృద్ధి చెందిన ఏకైక దేశం జ‌పాన్‌ కావడం విశేషం. ఇరుగు పొరుగు దేశాల్లో కరోనా కరాళనృత్యం చేసిన జపాన్‌లో చాలా స్వల్పంగా కేసులు నమోదయ్యాయి. జపాన్ ప్రజలు పాటించే క్రమశిక్షణ చర్యలే అందుక్కారణం.జపాన్ ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధ‌రిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను కచ్చితంగా పాటిస్తున్నారు. దీంతో కొత్తగా కేసులు నమోదు కావడం లేదు. ఇప్పటికే వైరస్ బారినపడ్డ వారికి చికిత్స అందించి నయం చేసి ఇళ్లకు పంపించేశారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఆ దేశం మరికొంత కాలం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related Posts