YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టెనంట్ గవర్నర్ ల వేతన సవరణకు మంత్రివర్గం ఆమోదం

 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టెనంట్ గవర్నర్ ల వేతన సవరణకు మంత్రివర్గం ఆమోదం

కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టెనంట్ గవర్నర్ ల జీతాభత్యాలను భారత ప్రభుత్వ కార్యదర్శి శ్రేణి లో ఉన్న అధికారులకు వర్తిస్తున్న మేరకు పెంచే ప్రతిపాదన ను మంత్రివర్గం ఆమోందించింది.  దీని ప్రకారం.. ఎల్జి లకు వేతనం, ఇతర భత్యాలు 2016 జనవరి 1వ తేదీ నుండి కరవు భత్యం, ప్రతి నెల కు 4,000 రూపాయల చొప్పున అతి వ్యయ నియంత్రణ భత్యం, ఇంకా స్థానిక భత్యాలు కలుపుకొని నెల నెలా 80,000 రూపాయలుగా వుండేది. దానిని పెంచి, కరవు భత్యం, ప్రతి నెల కు 4,000 రూపాయల చొప్పున అతి వ్యయ నియంత్రణ భత్యం, ఇంకా భారత ప్రభుత్వంలో కార్యదర్శి శ్రేణి లో ఉన్న అధికారులకు లభించే స్థానిక భత్యాలతో సహా  2,25,000 రూపాయలకు పేంచారు. అయితే,  స్థానిక భత్యాలు, అతి వ్యయాన్ని నియంత్రించే భత్యం మినహా మొత్తం పారితోషికం ఒక రాష్ట్రం యొక్క గవర్నర్ పొందే మొత్తం పారితోషికాన్ని మించి వుండదు.

Related Posts