YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జూలై 17 నాటికి రాజధాని మార్పు

జూలై 17 నాటికి రాజధాని మార్పు

జూలై 17 నాటికి రాజధాని మార్పు
విజయవాడ, జూన్ 26,
రాజధాని తరలింపునకు అంతా సిద్ధమయింది. దాదాపు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లేనని అధికార పార్టీ భావిస్తుంది. అయితే కరోనా విజృంభిస్తుండటతో కొంతకాలం ఆగాలని ప్రభుత్వం భావిస్తుంది. రాజధాని అమరావతిని వీలయినంత త్వరగా తరలించాలని జగన్ భావిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన చేసి ఏడు నెలలు గడుస్తున్నా అడుగు ముందు పడకపోవడంతో ఆయన అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.ఇప్పటి వరకూ రాజధాని తరలింపు వ్యవహారం న్యాయస్థానంలో ఉంది. అలాగే శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపినట్లు టీడీపీ చెబుతున్నా తాజా పరిణామాలతో నెల రోజుల్లో రాజధాని తరలింపునకు మార్గం సుగమమయినట్లేనని అధికార వైసీపీ భావిస్తుంది. రెండోసారి శాసనమండలికి బిల్లులను పంపినప్పుడు వాటిని ఆమోదించినా, లేకున్నా నెల రోజుల తర్వాత అవి ఆమోదం పొందినట్లేనన్నది అధికార పార్టీ వాదన. ఈ వాదనకు న్యాయనిపుణులు కూడా అంగీకరిస్తున్నారు.అంటే జులై 17వ తేదీ నాటికి రాజధానుల విభజన బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆటోమేటిక్ గా ఆమోదం పొందుతాయన్నది వైసీపీ నేతలు చెబుతున్న విషయం. అయితే జులై 17 వతేదీన రాజధాని తరలింపు ప్రక్రియకు అన్నీ అడ్డంకులు తొలగినట్లే. అయితే జులై 17 వ తేదీన తరలించేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని చెబుతున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న తరుణంలో రాజధాని తరలింపు సాధ్యం కాదని తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా స్పష్టం చేశారు.కానీ జులై 17వ తేదీ తర్వాత కొన్ని కార్యాలయాల తరలింపు ఉంటుందంటున్నారు. నిజానికి విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టినా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది అధికార పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రయోగాత్మకంగా జులై 17వ తేదీ నుంచి కొన్ని కార్యాలయాలను విశాఖకు తరలించే అవకాశం ఉందన్నది అధికార వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్.

Related Posts