ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దారుణమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోడానికి కారణం చంద్రబాబేఅని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దారుణమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.బుదవారం ఇక్కడ మీడియా తో మాట్లాడుతూ చిత్తశుద్ధితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ పోరాటం చేస్తోందని,రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే డీఎన్ఏ అని అన్నారు. గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నామని, గతంలో ఏపీకి హోదా రాకపోవడానికి, అమలు చేయకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అని, సీఎం అనుసరిస్తున్న వైఖరి, ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ప్యాకేజీకి ఒప్పుకున్నారని ఆయన విమర్శించారు. గాడ్సే, మహాత్మా గాంధీని చంపడానికి ముందు పాద నమస్కారం చేసి ఎలా హతమార్చాడో... అంతకంటే దారుణమైన వ్యక్తి చంద్రబాబు అని విజయసాయి అన్నారు. బాబు రాష్ట్రానికి,రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారని, చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారన్నారు.