YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 5 వరకు బేగం బజార్ బంద్

 5 వరకు బేగం బజార్ బంద్

 5 వరకు బేగం బజార్ బంద్
హైద్రాబాద్, జూన్ 26, 
హెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్న వేళ నగరంలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్లలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ కిరాణ మర్చంట్‌ అసోసియేషన్‌ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు రోజురోజుకూ బాగా తీవ్రం అవుతున్నందున వారం పాటు బేగంబజార్‌లోని కిరాణా దుకాణాలు మూసేయనున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు బేగంబజార్‌లో దుకాణాలు మూసివేయనున్నట్లు కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు.కరోనా కేసులు పెరుగుతున్నందున హైదరాబాద్‌లో మరికొన్ని మార్కెట్లు సైతం లాక్ డౌన్ విధించుకుంటున్నాయి.వచ్చే నెల 5వ తేదీ వరకు సికింద్రాబాద్ జనరల్ బజార్, సూర్యా టవర్స్, ప్యారడైజ్ ప్రాంతాల్లోని అన్ని దుకాణాలు మూసి వేయనున్నారు. దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఆదివారం నుంచి మరికొన్ని మార్కెట్లను కూడా మూసేయనున్నట్లుగా అసోసియేషన్ సభ్యులు తెలిపారు.ఇక తెలంగాణలో ఒక్కరోజే మొత్తం 920 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 737 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 86 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 60 కొత్త కరోనా కేసులను గుర్తించారు.

Related Posts