సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో దళితులు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, అణగారిన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసింది.. అలాగే నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో బడుగుల అభ్యున్నతికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో చర్చకు రావాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 192 జయంతిని పురస్కరించుకుని బీసీమోర్చా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన బహిరంగా సభనుఉద్దేశించి డాక్టర్ లక్ష్మన్ మాట్లాడారు. కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకు గురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జోతిరావ్ ఫూలే అని డాక్టర్ లక్ష్మన్ కొనియాడారు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన ఫూలేను మొదటి మహాత్ముడిగా పిలవబడ్డారని ఆయన తెలిపారు. శూద్రులు, మహిళలకు విద్యాగంధం అందించంఏదుకుచంచేందుకు ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. బాలికల విద్య, వితంతు పునర్వివాహం వంటి సామాజిక ఉద్యమాలను చేపట్టి ఆర్థికంగా, సామాజికంగా బీసీలు ఎదిగేందుకు దిశానిర్దేశం చేసిన ఫూలే అందిరికీ ఆదర్శనీయులని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. మహాత్మ జ్యోతిరావ్ ఫూలే చూపిన బాటలో, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తూ.. బడుగు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి నరేంద్రమోదీ.. దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఓ పేద వ్యక్తి దేశ ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్.. ప్రధాని పట్ల చౌకబారు విమర్శలు చేయడం శోచనీయమన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ ను రెండుసార్లు ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌దని, కాంగ్రెస్ బీసీలను మొదటి నుంచి కేవలం ఓటర్లుగానే పరిగణించింది తప్పా.. ఏనాడూ వారి అభ్యున్నతికి పాటు పడలేదని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో 40 శాతం జనాభాకు కనీసం మరుగుదొడ్లు కూడా లేవని, మోదీ ప్రధాని అయిన తర్వాత ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చి.. వాటికి ఆత్మగౌరవాలయాలుగా నామకరణం చేశారన్నారు. తన తల్లి వంటింట్లో కట్టెల పొయ్యితో వంటచేస్తూ... పడిన కష్టాలు చూసిన మోదీ.. ఏ తల్లికి అలాంటి కష్టం రాకూడదన్న సంకల్పంతో దాదాపు 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో దాదాపు 18 వేల గ్రామాల్లో కరెంట్ సౌకర్యం కూడా లేదని, మోదీ ప్రధాని అయిన తర్వాత వేయి రోజల్లో దాదాపు 16 వేల గ్రామాల్లో విద్యుత్ వసతి కల్పించారన్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాని నరేంద్రమోదీ అహర్నిశలు శ్రమిస్తుంటే.. ఓ బీసీ వ్యక్తి ఎదుగుదల చూసి ఓర్వలేని పార్టీలు.. మోదీ ప్రభుత్వం పట్ల విషం చిమ్మడం శోచనీయమని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.పేదలు, బీసీలు, దళితుల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ అహర్నిశలు కష్టపడుతున్నారని, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తి కుటుంబానికి 4 లక్షల ఆర్థిక సాయం కేంద్రం చేస్తుందన్నారు. బేటీ పడావో-బేటీ బచావో పథకం ద్వారా బాలికా సంరక్షణ పథకాన్ని అమలు చేస్తోందని, అలాగే ఆడపిల్ల పేరుమీద పద్నాలుగు ఏళ్ల పాటు నెలకు 1000 రూపాయాలు కడితే.. కేంద్ర ప్రభుత్వం 6 లక్షల 50 వేల రూపాయలను అందిస్తుందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.చదువుకున్న యువత, దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడం కోసం మోదీ ప్రభుత్వం... 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలిచ్చి ఉపాధి చూపారని, నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 45 వేల మంది దళితులను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. అలాగే ముద్రా యోజన పథకం ద్వారా దాదాపు 79 శాతం దళితులు లబ్ధి పొందుతున్నారన్నారు.నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ... ఇలా గాంధీ కుటుంబీకులే దేశాన్ని పాలించాలన్న అక్కసుతో రగిలిపోతున్న కాంగ్రెస్ నేతలు... ఓ పేద వ్యక్తి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేక తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అసహనానిని ప్రజలే తగిన బుద్ధి చెబుతారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం బీసీల పట్ల తీవ్ర వివక్షత చూపుతోందని, బీసీలకు బర్లు, గొర్లు, మేకల తాయిలాలు ఇస్తూ... వారిని మభ్యపెడుతున్నారు తప్పా.. బీసీల అభ్యున్నతికి టీఆర్ ఎస్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. మళ్లీ మళ్లీ మోసం చేసేందుకు బీసీలు అమాయకులు కారని, బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని డాక్టర్ లక్ష్మన్ పునరుద్ఘాటించారు.కేసీఆర్ సర్కార్.. చిట్టచివరి బడ్జెట్‌లో కూడా బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, బీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. బీసీ ఈ, బీసీ-సీ కేటగిరిలో ఉన్న ముస్లింలు, క్రిస్టియన్ మైనారిటీలకు పూర్తి ఫీ - రీయింబర్స్‌మెంట్ చేస్తున్న ప్రభుత్వం బీసీ విద్యార్థిని విద్యార్థుల పట్ల ఎందుకు వివక్ష చూపుతోందని డాక్-ర్ లక్ష్మన్ ప్రశ్నించారు. బీసీ విద్యార్థులకు నూటికి నూరు శాతం ఫీ రీయింబర్స్‌మెంట్ వచ్చేంత వరకు బీసీ సంగ్రామ సభల ద్వారా ప్రభుత్వాన్ని ఎండగడుతామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ సమస్యలు చర్చకు రాకుండా ప్రభుత్వంకుట్ర చేసిందని, ఢిల్లీలో మాత్రం రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో టీఆర్ఎస్ నిరసనలు చేసిందని, దీన్ని బట్టే టీఆర్ఎస్ ద్వంద్వ నీతి బయటపడిందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.చివరికి ప్రైవేటు యూనివర్సిటీల బిల్లులో కూడా బీసీలకు రిజర్వేషన్లు కేటాయించకపోవడం దారుణమని, కార్పొరేట్ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ..కేసీఆర్ సర్కార్ పేదలను విద్యకు దూరం చేస్తుందని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. పంచాయతీరాజ్ బిల్లులో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచకపోవడం దారుణమన్నారు. గతంలో ఉన్న 34శాతం రిజర్వేషన్లలో నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని డాక్టర్ లక్ష్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినా..ఎలాంటి చర్యలు తీసుకోలేదని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.
కేవలం మజ్లిస్ పార్టీ కొమ్ముకాసేందుకు, వారి ఒత్తిడికి లొంగిపోయిన టీఆర్ ఎస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీతోపాటు ఇప్పటి టీఆర్ఎస్ కూడా బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని డాక్టర్ లక్ష్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలకు అండగా నిలిచే ఏకైన పార్టీ బిజెపి మాత్రమేనని, బీసీలు అంతా సమైఖ్యంగా బిజెపికి మద్ధతుగా నిలిచి తమ హక్కుల సాధనకు కలిసి రావాలని డాక్టర్ లక్ష్మన్ పిలుపునిచ్చారు.