గనులను ప్రైవేటికరించవద్దు
జయశంకర్ భూపాలపల్లి జూన్ 26
కేంద్ర ప్రభుత్వం బొగ్గుపరిశ్రమల ను వేలం వేస్తూ ప్రైవేటీకరించడాన్ని సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం (టి బి జి కే ఎస్) వ్యతిరేకించింది. శుక్రవారం నాడు భూపాలపల్లి సింగరేణి గనుల ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను కార్మికులు దహనం చేపారు. జులై 2 వ తారీకు ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 41 బొగ్గు బ్లాక్ లను ఈ నెల 18 న వేలం ద్వారా ప్రైవేటు పెట్టుబడిదారులకు ఈ దేశ సంపదను కారు చౌక గా సునాయాసంగా ధారాదత్తం చేసిందని వారు ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం బొగ్గు గనుల వేలంపాటలను నిలిపివేసి ప్రభుత్వ రంగంలో నే సింగరేణి, కోల్ ఇండియా సంస్థ ల ఆధ్వర్యంలో బొగ్గు క్షేత్రాలు నడపాలని డిమాండ్ చేసారు. బొగ్గు గనులు నడిపేందుకు కొన్ని టెక్నీకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అనుభవరహిత్యంతో నడుపలేమని వెనుకంజ వేసిన పారిశ్రామిక వేత్తలను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులను ఒప్పించి వారికి సానుకూలంగా అనుకూలంగా చట్టాలను మారుస్తూ డిపాజిట్లు, రాయల్టీలు, పన్నులు, సుంకాలను పూర్తి స్థాయిలో తగ్గింపుతో ప్రయోజనాలుకల్పిస్తూ బొగ్గు ఉత్పత్తి కి మద్దతు నిస్తు అన్ని రకాలుగా మౌలిక వసతులు సదుపాయాలతో ప్రోత్సహించడాన్ని కార్మిక సంఘాల నాయకులు తప్పు పట్టారు. కార్మిక భద్రత, వేతన భద్రత, రక్షణ తదితర ముఖ్యమైన సదుపాయాలు హక్కులను కల్పించాల్సీన ప్రభుత్వం ట విచక్షణ రహితంగా కార్మిక హక్కులను, చట్టాలు, కార్మిక సంఘాల ను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. మైన్స్ యాక్టు, మైన్స్ రూల్స్ కు విరుద్ధంగా ,సేఫ్టీ కి,విరుద్ధంగా వేతన భద్రత లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా అతితక్కువ జీతాలతో కాంట్రాక్టు కార్మిక విధానాలతో శ్రమ దోపిడీకి అవకాశం కల్పిస్తుందని అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రయివేటికరణను విరమించికోక పోతే నిరవధిక సమ్మెకైనా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సిద్దమని హెచ్చరించారు