ఎమర్జెన్సీ ఒక మాయని మచ్చ
రాజమండ్రి జూన్ 26
ఎమర్జన్సీ ప్రజాస్వామ్య మాయని మచ్చగా,ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన నాయకులకి శుక్రవారం పరవస్తూ సత్యగోపినాధ్ దాస్ ఆధ్వర్యంలో రివర్ బే హోటల్ లో చిరు సత్కారం చేసారు. ముఖ్య అతిధులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. అయన ఆ నాటి చీకటి రోజులను వివరించారు. పరవస్తు సత్య గోపినాధ్ దాస్ మాట్లాడుటూ ఆనాడు వారు చేసిన పోరాటాల ఫలితమే ఈనాడు దేశం ప్రజస్వామ్యంగా వర్ధిల్లాడానికి కారణం అని కొనియాడారు. సన్మాన గ్రహీత ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ ఆ రోజు జరిగిన పరిణామాలను వారు వారి మిత్రుల జైలు జీవితం యొక్క అనుభవాలు అందరికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఓలేటి సత్యనారాయణ, రిమ్మలపూడి సుబ్బరాజు, మహంకాళి రామకృష్ణ, కాకరల కొటేశ్వరవులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు,నాయకులు రేలంగి శ్రీదేవి, క్షత్రియ బాల సుబ్రమణ్యం సింగ్, చౌదరి,బొమ్ముల దత్తు, లాల్ బహదూర్ శాస్త్రి, పురుషోత్తమ శాస్త్రి, శాస్త్రి ,పన్నలా సంతోషి,కొలివలస హారిక, ఆకుల శ్రీధర్,రొంగల గోపి,సుంకర బాలు,బాబీ,చిన్ని, హీరాచంద్ జైన్,బూర రామచంద్రరావు,కాలేపు సాయి,కర్రీ వరలక్ష్మి, లలిత్ జైన్,జీ వెంకటరమణ,రాయుడు వెంకటేశ్వరవు పాల్గొన్నారు.