YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ ను విమర్శించడం తగదు

దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ ను విమర్శించడం తగదు

దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ ను విమర్శించడం తగదు
జగిత్యాల జూన్ 26
దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ ను విమర్శించడం తగదని కోరుట్ల పట్టణ దళిత ప్రజాప్రతినిధుల ఆన్నారు.శుక్రవారం కోరుట్ల పట్టణ దళిత ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ తప్పతాలు విషయంలో రైస్ మిల్లర్లులతో కుమ్మక్కుయ్యారని విమర్శించడం తగదని ఆన్నారు.  కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఏం న్యాయం చేశారని, 24 గంటల విద్యుత్తును ఇచ్చారా ? కాళేశ్వరం నీళ్లు ఇచ్చారా? కనీసం రైతులకు మద్దతు ధర చెల్లించలేదని,ఎరువులకు ,విత్తనాలకు రోజుల తరబడి ఎదురు చూస్తూ మరణించిన రైతులకు మీరు ఏమి న్యాయం చేశారని ప్రశ్నించారు.టీఆర్ఎస్ ప్రభుత్వంలో  వచ్చిన తర్వాత రైతుల కల్లల్లో ఆనందం ఉన్నదని, రైతు కుటుంబాలకు భరోసా ఉన్నదని, రైతుబంధు ఉన్నదని, రైతు బీమా ఉన్నదని, విద్యుత్ ఉన్నదని, ఎరువులు, విత్తనాలు ఉన్నాయని, ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.కరువు కాలంలో వడ్లు కొనుగోలు చేయలేని పరిస్థితులలో రైస్ మిల్లర్లు యజమానులతో మాట్లాడి వడ్లు కొనుగోలు చేసిన ఘనత ఈశ్వర్ అని కొనియాడారు. ప్రతిపక్ష నాయకులు వడ్లు కొనుగోలు విషయంలో ధర్నా చేస్తు తప్పతాలు క్రింద 2 కిలోల తరుగు తీసి కొనుగోలు చేయాలని చెప్పి, ఇప్పుడు మాట మార్చడం సిగ్గుచేటని అందుకే మిమ్మల్ని ప్రజలు నమ్మరని విస్మరించారు. మరోసారి మా మంత్రి కొప్పుల ఈశ్వర్ ని విమర్శిస్తే సహించేది లేదని,దళిత సంఘాల తరుపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మోర్తాడ్ లక్ష్మీనారాయణ, బలిజ పద్మ- రాజిరెడ్డి ,గందం గంగాధర్,పేర్ల సత్యం,బద్ది సుజాత, మురళి తదితరులు పాల్గొన్నారు.

Related Posts