YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతులకు కార్మికులకు న్యాయం చేయండి

రైతులకు కార్మికులకు న్యాయం చేయండి

రైతులకు కార్మికులకు న్యాయం చేయండి
నంద్యాల జూన్ 26
నంద్యాల వ్యవసాయ పరిశోధనా క్షేత్రం లోని స్థానము లోని 60 ఎకరాల భూమిని పరిశోధన కేంద్రం గానే కొనసాగించాలని  ఉప ముఖ్యమంత్రి అళ్ల నాని కలిసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం  రైతు సంఘం డివిజన్ కార్యదర్శి జి .సోమన్న  సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి షారఫీభాష వినతిపత్రం సమర్పించారు.  నంద్యాల వ్యవసాయ పరిశోధనా క్షేత్రం స్థానములో సుమారు  115 సంవత్సరముల నుండి 130 ఎకరాలలో ఇక్కడి పరిశోధన శాస్త్రవేత్తలు ఈ క్షేత్రము నుండి అనేక కొత్త రకమయిన వంగడాలను సృష్టిస్తూ పరిస్థితులకు అనుకూలమైన వంగడాలను సృష్టిస్తూ  దేశంలోనే మూడో స్థానంలో నిలిచారని అన్నారు . అటువంటి చరిత్ర గలిగిన పరిశోధన కేంద్రంలోని 60 ఎకరాల భూమిలో మెడికల్ కాలేజీ కట్టడం దారుణమని అన్నారు. ఈ క్షేత్రములో అనేకమంది కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారని తెలిపారు . మెడికల్ కాలేజీ నిర్మిస్తే ఎందరో  ఈ పరిశోధనా క్షేత్రమును నమ్ముకొని జీవనం సాగిస్తున్న కూలీలు అందరూ జీవన ఉపాధి కోల్పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు .రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి  అనేక సందర్భాలలో చెప్పడం జరిగిందని అది ఏక్కడ కూడా అమలు కావడం లేదని అన్నారు . కాబట్టి రైతులకు ఉపయోగపడే కేంద్రమును కొనసాగిస్తూ అదే విధముగా ఎందరో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారినందరిని కూడా ఆదుకోవాలని మంత్రి కి వివరించడం జరిగిందని తెలిపారు . అందుకు మంత్రి  సానుకూలంగా స్పందించి రైతుల కొరకు అలాగే ఉపాధి పొందుతున్న కూలీలందరి ను కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

Related Posts