పార్లమెంట్ స్తంభించడానికి విపక్షాలే కారణమంటూ మోడీ నిరశన దీక్షకు...కౌంటర్ తో రెడీ అంటున్నారు.. చంద్రబాబు. ఇంతకీ మోడీకి చంద్రబాబు ఇచ్చే కౌంటరెంటీ ...?పార్లమెంటులో ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఎంపీలు గురువారం నిరాహార దీక్ష చేయనున్నారు. దేశవ్యాప్తంగా పలువురు ఎంపీలు వారి వారి నియోజకవర్గాల్లో నిరశన దీక్షల్లో పాల్గొంటారు.ఎక్కడైనా విపక్షాలు నిరసన ప్రదర్శనలు .. నిరాహారదీక్షలు చేస్తాయి. కానీ చాలా అరుదుగా మాత్రమే అధికారంలో ఉన్నవారు ఇలాంటి చేపడతారు. అదీ స్వయంగా ప్రధానే నిరశన దీక్షకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. విపక్షాలు వల్లే సభ సజావుగా సాగలేదని కేంద్రం చెబుతున్నా.. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ .. తెలుగు ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన నిరసనలే కారణం. ఈ పరిస్థితికి పరోక్షంగా మోడీ సర్కారే కారణం . అయినా విపక్షాలు చేపట్టిన అవిశ్వాసంపై చర్చ జరగకుండా మోడీసర్కార్ వ్యూహత్మకంగా వ్యవహరించింది. ఇప్పుడు విపక్షాలే కారణమంటూ .. తమ మీద పడ్డ అపప్రదను తొలగించుకునే ప్రయత్నంచేస్తోంది. మోడీ నిరశన దీక్షకు చంద్రబాబు కౌంటర్ సిద్ధం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోడీ చేసిన వాగ్ధానాలను ఈ నెల 30న తిరుపతి సభలో వినిపిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా తిరుపతి వచ్చిన మోడీ .. ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. అలాగే విభజన హామీలు నెరవేరుస్తామని.. ఏపీకి అండగా ఉంటామని ప్రామిస్ కూడా చేశారు. ఇప్పుడు అయ్యే మాటలు మోడీ వినిపించేలా చేయడానికి చంద్రబాబు బహిరంగ సభ కు ప్లాన్ చేశారు చేసిందంతా చేసి.. మోడీనే దీక్షకు దిగుతానని అనడం విడ్డూరంగా ఉందంటున్నారు. విపక్షాలను మోడీ తప్పుపట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.