నరనారాయణులు అంటే ఎవరు ?
శ్రీ మహావిష్ణువు #నరసింహ అవతారము దాల్చి హిరణ్యకశ్యపుడిని సంహరించిన శ్రీహరి అవతారములోని నరరూపము నరుడిగా మరియు సింహరూపము నారాయణునిగా విడిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి. వీరిరువురు "బదరికాశ్రమము"లో తపస్సు చేసుకొనెడివారు. ఇంద్రుడు వారి తపస్సు భంగం చేయుట కొరకు అప్సరసలను పంపుతారు. నారాయణుడు తన తొడ గీటి అప్సరసల కంటే సుందరమైన కాంత ఊర్వశి ని సృష్టిస్తాడు. తొడ (ఊరువు) నుండి పుట్టినది కావున ఊర్వశి అని పేరు కలిగింది. పూర్వకాలమున ఒక రాక్షసుడు బ్రహ్మ గూర్చి ఘోర తపస్సు చేసి అభేద్యమైన 1000 కవచాలు రక్షణకోసం వరంగా పొంది, "సహస్రకవచుడు" అనిపేరు గా వాడికి స్థిరపడి పోయింది. ఆ వర గర్వంతో సకలలోకాలను గడగడా లాడించగా ,దేవతలందరూ శ్రీ మహావిష్ణువునుశరణు కోరి వేడుకొనగా.... దేవతలతో శ్రీమహావిష్ణువు ఇలా సెలవిసస్తాడు, భయపడకండి వాడికి అంత్యకాలం సమీపించినరోజున వాడే నావద్దకు వచ్చి మరణిస్తాడు అని అభయం ఇస్తాడు .అదే ప్రకారముగా హిరణ్యకశ్యపుని సంహరించిన తరువాత నరసింహావతారంగా ఉన్న శ్రీ మహా విష్ణువు రెండు రూపాలుగా విడిపోయాడు, నరరూపం నరుడి గానూ ,సింహరూపం నారాయణుడిగానూ మారి #ధర్మునికి కుమారులుగా జన్మించారు . వారే "నరనారాయణులు" వీరు పుట్టుకతోనే మహా పరాక్రమవంతులు,వీరాధివీరులు అందుకే వీళ్ళు ఆయుధధారులై బదరికా వనంలో తపస్సు చేయడం ప్రారంభించారు. ఈ సంగతి తెలుసుకున్న సహస్రకవచుడు వారితో యుద్ధం చేయ సంకల్పిస్తాడు .అంతట ఆ నరనారాయణులు ఓ వీరా... నీ పోరాటం చేయ కోరికకు మేము మిక్కిలి సంతసించాము కానీ మేము ఇరువరమూ నీ ఒక్కడితో యుద్ధం చేయడం ధర్మసమ్మతం కాదు కావున ఒకరి తరువాత ఒకరము నీతో యుద్ధం చేయగలము అని చెప్పి , ఆ సమయములో వారు తపస్సు మార్చి మార్చి చేశారు. ఒకరు యుద్ధము చేయి సమయమున మరొకరు తపస్సు చేయిట, మరొకరు తపస్సు చేయి సమయమున ఇంకొకరు యుద్ధము చేయిట జేసి సహస్ర కవచుడికున్న 1000 కవచములలో 999 కవచములు ఛేధిస్తారు. సహస్రకవచుడు అన్ని కవచాలు కోల్పోయి ఒకే కవచం తో పారిపోయి సూర్యభగవానుడితో మొరపెట్టుకున్నాడు,అంతటా సూర్యభగవానుడు నీవు ఇచ్చటనే నీకు మరుజన్మ కలుగువరకు ఉండిపోగలవు, అని ఆశ్రయం కల్పిస్తాడు. ద్వాపరమందు కుంతీదేవికి సూర్యభగవానుడి వరప్రసాదమే ఈ సహజ కవచకుండలములు గల *కర్ణుడు* గా జన్మించాడు.పూర్వజన్మలోని నరనారాయణులే ... అర్జునుడు మరియు శ్రీకృష్ణ పరమాత్మ ! దాని కారణముగానే భారత సంగ్రామం లో కూడా నారాయణుడు రధంపై రథసారధిగా కూర్చుని ఉండగా నరుడి రూపంలో ఉన్న అర్జునుడు సహజ కవచకుండలము తో పుట్టిన కర్ణుడి ని సంహరించాడు
వరకాల మురళీమోహన్ సౌజన్యంతో