YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 యడ్డీకి తలనొప్పిగా వలస కార్మికుల ప్యాకేజీ

 యడ్డీకి తలనొప్పిగా వలస కార్మికుల ప్యాకేజీ

 యడ్డీకి తలనొప్పిగా వలస కార్మికుల ప్యాకేజీ
బెంగళూర్, జూన్ 27,
కర్ణాటకలో యడ్యూరప్పకు మనశ్వాంతి లేకుండా పోయింది. ఒకవై పు కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు పదివేలు దాటాయి. మరోవైపు ఆయనకు రాజకీయంగా కూడా పెద్దగా కలసి రావడం లేదు. ిఇప్పటికే ఆయనకు సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి ఎదురవుతుంది. ఇక పార్టీ హైకమాండ్ యడ్యూరప్పను పెద్దగా పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప కుర్చీకి ఎసరు తప్పదన్న ప్రచారం మరింత ఊపందుకుంది.తాజాగా సీనియర్ నేత ఉమేష్ కత్తి మరోసారి యడ్యూరప్ప పై ధ్వజమెత్తారు. రాష్ట్ర నాయకత్వ మార్పిడి జరగాల్సిందేనని ఉమేష్ కత్తి డిమాండ్ చేశారు. ఉత్తర కర్ణాటకకు చెందిన వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తాను కూడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అర్హుడేనని ఆయన చెప్పకొచ్చారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు అంతకంటే ఏం క్వాలిఫికేషన్ ఉంటుందని ప్రశ్నించారు. అంటే యడ్యూరప్పను ఉమేష్ కత్తి నేరుగా టార్గెట్ చేసినట్లే కన్పిస్తుంది. నాయకత్వ మార్పిడి కోసం బీజేపీలో పోరు ప్రారంభమయినట్లేనని ఉమేష్ కత్తి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.మరోవైపు యడ్యూరప్ప పాలనా పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆయన కుమారుడు రాఘవేంద్ర జోక్యం ఉంటుందని నిన్న మొన్నటి వరకూ విమర్శలు విన్పించాయి. దీనిపై పార్టీ అధిష్టానం సయితం జోక్యం చేసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో తనకు అనుకూలమైన వారిని నియమించింది. అయినా యడ్యూరప్ప ఓపిక పట్టారు. రాజ్యసభ ఎన్నికల్లోనూ యడ్యూరప్ప చెప్పిన వారెవరికీ టిక్కెట్లు ఇవ్వలేదంటే ఆయన ప్రాధాన్యత ఏంటో ఇట్టే తెలిసిపోతుంది.తాజాగా కరోనా సమయంలో యడ్యూరప్ప ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం కూడా ఆయనకు ఇబ్బందిగా మారింది. వలస కార్మికుల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని పీఏసీ విచారణలో వెల్లడయంది. రాష్ట్రంలో 1.25 లక్షల మంది వలస కార్మికులకు ఒక్కొక్కరికీ ఐదు వేలు చొప్పున పంపిణీ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంది. అయితే వారి పేర్లు కూడా లేకపోవడంతో ఇది భారీ కుంభకోణంగా విపక్షాలు విమర్శలకు దిగాయి. వలస కార్మికుల కోసం ప్రకటించిన 1600 కోట్ల ప్యాకేజీపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద యడ్యూరప్ప ఇటు పాలనపారంగా, అటు పార్టీలోనూ ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.

Related Posts