YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు సినిమా

మే 12న హైద్రాబాద్ లో సల్మాన్ షో

 మే 12న హైద్రాబాద్ లో సల్మాన్ షో

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భాగ్యనగరంలో సందడి చేయనున్నాడు. ద బాంగ్..ది టూర్ ’ పేరుతో ఒక్కో నగరంలో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. సౌతిండియా సినిమా హబ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.జింకల హత్య కేసులో సల్మాన్.. ఇటీవలే జోధ్‌పూర్ జైలుకెళ్లి తిరిగొచ్చాడు. ఈ షోలో అతడికి అభిమానులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. మరోవైపు.. అభిమానులకు తమ జీవితంలో ఒకే ఒకసారి లభించే అరుదైన అవకాశం ఇదని నిర్వాహకులు చెబుతున్నారు. కార్యక్రమానికి సంబంధించిన టిక్కెట్ల విక్రయం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. సల్మాన్‌తో పాటు బాలీవుడ్ తారలు సోనాక్షి సిన్హా, జాక్వెలైన్ ఫెర్నాండేజ్, ఇండియన్ మైకెల్ జాక్సన్ ప్రభుదేవా, డైసీ షా, గురురంధావా హైదరాబాద్‌కు రానున్నారు. మే 12న నిర్వహించనున్న సల్మాన్ స్టేజ్ షోకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం గచ్చిబౌలి స్టేడియం అంగరంగ వైభవంగా సిద్ధమవుతోంది. ‘దబాంగ్ టూర్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ స్టేజ్ షోలో 120 మంది డ్యాన్సర్లు, ఇతర టెక్నీషియన్లు పాల్గొంటారు. లైవ్ మ్యూజిక్‌కి స్టెప్పులతో అదరగొడతారు.‘బాలీవుడ్ మెగా స్టార్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ ను దృష్టిలో పెట్టుకొని ఈవెంట్‌ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు

Related Posts