YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

 మోడీ విదేశాంగ విధానం ఫెయిల్

 మోడీ విదేశాంగ విధానం ఫెయిల్

 మోడీ విదేశాంగ విధానం ఫెయిల్
హైద్రాబాద్, జూన్ 27
మోదీ విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైనట్లే అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. భారత్‌కు గతంలో ఉన్న మిత్ర దేశాలన్నీ ప్రస్తుతం శత్రుదేశాలుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. రష్యాలాంటి మిత్రదేశం కూడా ఇలాంటి పరిస్థితుల్లో పట్టించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. చిరకాల మిత్ర దేశంగా ఉన్న నేపాల్‌ కూడా భారత భూభాగాన్ని తమదిగా చెప్పుకుంటోందని గుర్తు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.తమ తప్పిదాలను కప్పిపుచ్చుకొనేందుకు భారత భూభాగంలోకి అసలు చైనా బలగాలు రానేలేదని మోదీ అబద్ధాలు ఆడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. చైనాకు భారత్ ధీటైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు, దేశం కోసం చైనా సరిహద్దుల్లో ప్రాణాలు విడిచిన కల్నల్ సంతోష్ బాబు సేవలను ఉత్తమ్ కొనియాడారు. తెలంగాణ చరిత్రలో ఆయన నిలిచిపోతారని అన్నారు. 45 ఏళ్ల పాటు భారత్-చైనా సరిహద్దులో ఒక్క ప్రాణం కూడా పోలేదని, బీజేపీ ప్రభుత్వ హయాంలో 20 మంది చనిపోయారని అన్నారు.మోదీ ఇప్పటిదాకా చేసిన విదేశీ పర్యటనల వల్ల దేశానికి ఏ ప్రయోజనం ఒనగూరిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విదేశాంగ విధానంలో కేంద్రం వైఫల్యం చెందిందని విమర్శించారు. దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు చేస్తున్న కృషిపై ఉత్తమ్‌ అభినందనలు తెలిపారు.కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీవీ జయంతి వేడుకలు.. ఈ నెల 28వ తేదీన పీవీ జయంతి వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరపాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు

Related Posts