ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- కలెక్టర్ వీరపాండ్యన్
నంద్యాల జూన్ 27
నంద్యాల శనివారం నాడు యస్ పీ వై రెడ్డి ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ యందు లీకేజీ కారణంగా ఒకరు మృతి. నలుగురు పరిస్థితి బాగలేక ఆసుపత్రికి తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన కలెక్టర్. యస్ పీ. జిల్లా అధికారులు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏస్పీవై ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదాన్ని , రక్షణ చర్యలను స్వయానా పరిశీలించి మీడియా తో మాట్లాడిన కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప.. ఆగ్రోస్ ఫ్యాక్టరీ లోపల అమ్మోనియా వాయువు చిన్నపాటి లీకేజ్ తో ఒకరు మృతి చెందారు అని అన్నారు . అతనితో పాటు ఉన్న మరో 4 గురు సేఫ్. మొత్తం అదుపులోనే ఉంది అని అన్నారు. అన్ని శాఖల అధికారులతో సంపూర్ణ రక్షణ చర్యలు చేపట్టాము అని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. ప్రమాదం ఏమీ లేదు. ఎవరూ ఆందోళన చెందవద్దు అని అన్నారు .ఫ్యాక్టరీ పరిసర ప్రాంతల ప్రజలు అధికారులు ప్రకటించేవరకు గృహాల నుంచి బయటకు రావద్దు అని తెలిపారు. కళ్ళు మంటలు వేసినట్లయితే చల్లని నీటి తడి బట్టతో కళ్ళు తుడుచుకొంటూ ఉండండి అని అన్నారు . ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు అని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ తో పాటు పరిశీలించిన స్థానిక ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి,రెవెన్యూ అధికారులు.తదితరులు పాల్గొన్నారు.