ఆన్ లైన్ క్లాసెస్ కు అధిక ఫీజులు వసూలు చేస్తున్న సంస్కృతి స్కూల్
స్కూల్ ముందు తల్లిదండ్రులు ఆందోళన
హైదరాబాద్ జూన్ 27
అన్ లైన్ క్లాసెస్ కు అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని కొత్త పేట లోని సంస్కృతి స్కూల్ ముందు పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. కోవిడ్౼19 తో విద్యాసంవత్సరం ప్రారంభం కాకపోవడంతో పలు ప్రైవేట్ స్కూల్స్ ఆన్ లైన్ క్లాసులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్లాసులకు కూడా రెగ్యులర్ ఫీజుల మాదిరి ఫీజులు కట్టాలని కొత్త పేట లోని సంస్కృతి స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులపై వత్తిడి పెంచడంతో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం యాజమాన్యం తో మాట్లాడే ప్రయత్నం చేశారు. యాజమాన్యం స్పందించకపోవడం తో ఆందోళన కు దిగారు. ఆన్ లైన్ క్లాసుల బుక్స్ కు 8 వేలు, యదావిధిగా రెగ్యులర్ ఫీజు 50 వేలు కట్టమనడం విడ్డూరంగా ఉందని, మధ్య తరగతి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మని తెలిపారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు స్పందించక పోవడం పై వారు విమర్శలు గుప్పించారు.