పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
విజయవాడ జూన్ 27
విద్యార్థులకు పాఠ్యంశాలలో అనుమానాలకు నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 123 123 124 ఏర్పాటు చేసామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలపై కేంద్ర నుంచి వచ్చిన గైడ్ లైన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. ఈ రోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు- నేడు చెప్పట్టాం. ఈ ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల పైన ప్రధానంగా దృష్టి సరించాం. నాడు- నేడు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 స్కూల్స్ ని ఎంపిక చేసాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అతి దారుణంగా ఉంది. నాడు- నేడు లో 9 అంశాలు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో కచ్చితంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. నాడు- నేడు లో అన్ని శాఖ అధికారులను పాల్గోనేలా చేసి పనులు వేగంగా పూర్తి చేస్తాం. ఈ రోజు రివర్స్ టెండరింగ్ విధానం వలన 143 కోట్లను ఆదా చేసాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసే వాటిలో ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. ఈ రోజు మేము ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వాటిలో ఎవరు తక్కువకీ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని నాణ్యతతో లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. నాడు-నేడు మొదటిలో భాగంగా 15,750 స్కూల్స్ ఎంపిక అయ్యాయి. ఇప్పటి వరకు నాడు- నేడు కి సంబంధించి ఫేస్ 1 లో 504 కోట్లు ఖర్చు చేసామని అన్నారు. 710 కోట్లను ఇప్పటికే రివాల్వింగ్ ఫండ్ కింద ఏర్పాటు చేసాం. నాడు- నేడు కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ నిధులకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. నాడు- నేడు కార్యక్రమానికి సంబంధించి కర్చుపెట్టే ప్రతి రూపాయి అందరికి తెలిసేలాగా ఆన్లైన్ లో ఉంచామని అన్నారు. జూలై నెలాఖరికి మేము చేప్పట్టిన నాడు- నేడు పనులు స్పష్టంగా కనిపిస్తాయి. బడ్జెట్ లో 16 శాతం మా ప్రభుత్వం విద్యకు ఖర్చు చేస్తుంది. కరోనా నేపథ్యంలో త్వరలోనే పాఠశాలను తెరవబోతున్నాము. హెచ్.ఎమ్ లు ఏ సమస్య వచ్చినా మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాము మీరు మీ సమస్య చెపితే వెంటనే పరిక్షరిస్తాం. ప్రధానోపాద్యాములకు మేము అండగా ఉంటాం. ఉద్యోగ సంఘాలు, హెచ్.ఎమ్ ల అసోసియేషన్ లతో నేను మాట్లాడతానని మంత్రి అన్నారు.