YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గాజువాకలో రౌడీల హల్ చల్

గాజువాకలో రౌడీల హల్ చల్

గాజువాకలో రౌడీల హల్ చల్
విశాఖపట్నం జూన్ 27 
విశాఖలో గ్యాంగ్ వార్ ఘటనలు శృతిమించుతున్నాయి.పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో విశాఖలో కలకలం రేగింది. గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలం సీతానగరంలో జరిగిన ఈ గ్యాంగ్‌వార్‌ లో‌ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీతానగరం ఆర్‌హెచ్‌ కాలనీలో మొల్లి మహేష్ అనే యువకుడు నిర్వహించిన పుట్టినరోజు వేడుకలలో రౌడీషీటర్ మొల్లి సంతోష్ పాల్గొన్నాడు. అదే వేడుకలకి వచ్చిన వడ్లపూడికి చెందిన రౌడీ షీటర్ గందవరపు తరుణ్ తో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. వీరి మధ్య పాత గొడవలు కూడా ఉండటంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఒకరిప్తె ఒకరు దాడులకు దిగారు.కత్తులతో రెండు వర్గాలు పరస్పరం దాడులకి ప్రయత్నించారు. సబ్బవరం మండలంలో జరిగిన వివాదమే దాడులకు కారణమని పోలీసులు చెబుతున్నారు. గాజువాక,పెదగంట్యాడ, సబ్బవరం మండల పరిధిలో  అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, భూ తగాదాలు సెటిల్‌మెంట్లు చేయడం కత్తులతో దాడులు చెయ్యడం మొల్లి సంతోష్ అలియాస్ సోనాసంత్ అలవాటుగా చెబుతున్నారు. ఒక్క న్యూపోర్టు పోలీసు స్టేషన్ లోనే 12  కేసులున్నట్లు సిఐ ప్తెడిపు నాయుడు తెలిపారు. అలాగే వడ్లపూడికి చెందిన గందవరపు తరుణ్  బిటెక్ చదివాడు. హత్య కేసులో ప్రధాన ముద్దాయి, అంతేకాకుండా స్తెబర్ నేరాలు చెయ్యడంలో దిట్ట. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఫేక్ కాల్స్ చేసిన విషయంలో కేసులు నమోదయ్యాయి... అలాగే తరుణ్‌పై ఐదు కేసులున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ పోలీసులు  కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Posts