YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గురుగ్రామ్ లో మిడతల దండు

గురుగ్రామ్ లో మిడతల దండు

గురుగ్రామ్ లో మిడతల దండు
న్యూఢిల్లీ, జూన్ 27
దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఆకాశంలో చాలా బాగా నల్లగా మారింది. అలాగని.. రుతుపవనాల రాకతో మబ్బులు పట్టాయనుకుంటే పొరపాటే. అది మిడతల దండు ఎఫెక్ట్. ఇప్పటికే కరోనాతో కుదేలవుతున్న దేశవాసులకు ఎదురైన కొత్త సమస్య. రాజస్థాన్, గుజరాత్, హర్యాణా తదితర రాష్ట్రాల్లో మిడతల దండు పేరు చెబితే జనం నిద్ర లోంచి కూడా ఉలిక్కి పడి లేచే పరిస్థితి ఉంది. ఈ ఎడారి కీటకాలు చేస్తున్న బీభత్సం అలా ఉంది.కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన మిడతలు మళ్లీ దండెత్తాయి. ఢిల్లీకి అతి సమీపంలో తిష్ఠ వేశాయి. పాకిస్థాన్ నుంచి తాజాగా మరో దండు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇంతకుముందు వచ్చిన మిడతల దండు వస్తూ వస్తూ పాక్ భూభాగంలో గుడ్లు పెట్లాయి. అవి పిల్లలై పెరిగి పెద్దవై భారత్ మీదకు దండయాత్రకు బయల్దేరాయి.పంట పొలాలపై వాలుతూ క్షణాల్లో నామరూపాల్లేకుండా తినేస్తున్న మిడతలు.. అటు జనావాసాల్లోనూ చేరి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కిటికీలు తెరిచి ఉంటే ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి. మిద్దెలపై లక్షలాదిగా తిష్ఠ వేస్తున్నాయి. దీంతో ప్రజలు ఏ పనీ కుదురుగా చేసుకోలేకపోతున్నారు. అటు రహదారుల వెంట మిడతల దండు ప్రయాణిస్తుందంటే.. తుఫాన్ తీరం దాటినట్టే!చికాకు పెట్టిస్తున్న మిడతలను తరిమికొట్టేందుకు జనాలు కొత్త కొత్త ఉపాయాలను కనుక్కొంటున్నారు. ఇంట్లో ప్లేట్లు, గిన్నెలను కొడుతూ చప్పుళ్లు చేస్తున్నారు. కొందరు కీటకనాశనులను చల్లుతున్నారు. మిడతల పర్యవేక్షణకు గురుగ్రామ్ జిల్లా అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పురుగు మందులను పిచికారీ చేసే పంపులను రైతులు సిద్ధం చేసి ఉంచుకోవాలని సూచించారు.

Related Posts