YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

నెగిటివ్ ఉన్నా...పాజిటివ్ రిపోర్టులు

నెగిటివ్ ఉన్నా...పాజిటివ్ రిపోర్టులు

నెగిటివ్ ఉన్నా...పాజిటివ్ రిపోర్టులు
హైద్రాబాద్, జూన్ 27,
ప్రయివేట్ ల్యాబ్‌లు కరోనా టెస్టులు చేస్తున్న తీరు పట్ల తెలంగాణ సర్కారు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా టెస్టులు చేయడంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం లేదని ఆరోగ్య శాఖ తెలిపింది. నెగటివ్ ఉన్న వారికి కూడా పాజిటివ్ అని రిపోర్టులు ఇస్తున్నట్లు ఎక్స్‌పర్ట్ కమిటీ విచారణలో తేలిందని పేర్కొంది. సీనియర్ మైక్రోబయాలజిస్టులు, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులతో కూడిన నాలుగు బృందాలు రాష్ట్రంలోని 16 ల్యాబ్‌ల్లో తనిఖీలు చేపట్టారని శుక్రవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ప్రయివేట్ ల్యాబ్‌ల్లో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని, స్టాఫ్ పీపీఈ కిట్లు ధరించడం లేదని.. పరిశుభ్రత సరిగా లేదని ఎక్స్‌పర్ట్ కమిటీ తెలిపిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా పరీక్షలు చేస్తున్న సిబ్బందికి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ విషయంలో సరైన శిక్షణ లేదనే విషయం తేటతెల్లమైందని తెలిపింది.కొన్ని ల్యాబ్‌లు క్వాలిటీ కంట్రోల్, టెస్టుల ధ్రువీకరణను అనుసరించడం లేదని తేలిందన్నారు. కొన్ని ల్యాబ్‌లు చాలా శాంపిళ్లను కలిపి పూల్ టెస్టింగ్ చేస్తున్నాయని.. పాజిటివ్ అని తేలిన సందర్భంలో వ్యక్తిగతంగా టెస్టులు చేయకుండా.. అందరికీ పాజిటివ్ అని రిపోర్ట్ ఇస్తున్నాయని.. దీంతో కొన్ని నెగటివ్ కేసులను కూడా పాజిటివ్‌గా చూపిస్తున్నారని ఎక్స్‌పర్ట్ కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయమై నిపుణులు అధ్యయనం చేయనున్నారు.జాగ్రత్త చర్యలు, నిబంధనలను కచ్చితంగా పాటించకపోవడంతో శాంపిళ్లు కలుషితమయ్యే అవకాశం తద్వారా.. పాజిటివ్ కేసులు పెరిగే ఛాన్స్ ఉందని కమిటీ అనుమానాలు వ్యక్తం చేసిందిచేసిన టెస్టులకు సంబంధించిన వివరాలను ఐసీఎంఆర్, రాష్ట్ర పోర్టల్‌లలో ల్యాబ్‌లు సరిగా నమోదు చేయడం లేదని నిపుణుల కమిటీ తెలిపింది. ఓ పెద్ద హాస్పిటల్‌లోని ల్యాబ్‌లో 3940 టెస్టులు చేయగా.. 1568 టెస్టులను మాత్రమే పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేశారని.. 475 పాజిటివ్ కేసులుగా తేలినట్లు చూపారని ఎక్స్‌పర్ట్ కమిటీ స్పష్టం చేసింది. దీంతో పాజిటివ్ కేసుల శాతం ఎక్కువగా ఉంటోందని తెలిపింది. చేసిన టెస్టుల వివరాలన్నీ బయటపెడితే.. పాజిటివ్ రేటు తగ్గుతుందని స్పష్టం చేసింది.ప్రయివేట్ ల్యాబులన్నీ కలిపి 9,577 టెస్టులు చేసినట్టు ఐసీఎంఆర్ పోర్టల్‌‌లో.. 6,733 టెస్టులు చేసినట్టు స్టేట్‌‌ హెల్త్ పోర్టల్‌‌లో అప్‌‌లోడ్ చేశాయి. 2,076 పాజిటివ్స్ వచ్చినట్టు ఐసీఎంఆర్ పోర్టల్‌‌లో.. 2,836 పాజిటివ్‌గా తేలినట్లు హెల్త్ పోర్టల్‌‌లో అప్‌‌లోడ్ చేశాయి. ల్యాబ్ రికార్డుల్లో.. 12,700 టెస్టులు చేస్తే, 3,571 పాజిటివ్స్‌‌ వచ్చినట్టు ఉంది. ప్రయివేట్ ల్యాబులు పోర్టల్స్‌‌లో అప్‌‌లోడ్ చేసిన రికార్డులను, ల్యాబ్ ఇంటర్నల్ రికార్డులను పరిశీలిస్తే అవకతవకలు బయటపడ్డాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.కొన్ని ల్యాబ్‌లు చాలా ఇరుకుగా ఉన్నాయని, పరిశుభ్రత సరిగా పాటించడం లేదని.. పరికరాల నిర్వహణ కూడా సరిగా లేదని ఎక్స్‌పర్ట్ కమిటీ తెలిపింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే టెస్టులు చేయాలని చెబుతున్నప్పటికీ.. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి కరోనా శాంపిళ్లను సేకరిస్తున్నారని నిపుణుల కమిటీ తెలిపింది.కొన్ని ల్యాబ్‌ల తీరు వల్ల తప్పుడు రిపోర్టులు రావడమే కాకుండా ఈ సెంటర్లకు వచ్చి వారికి, ల్యాబ్‌ల్లో పని చేసే వారికి కరోనా సోకే ముప్పు పెరుగుతోందని నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధలను పాటించని ల్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

Related Posts