YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

నిట్ లో ప్రత్యేక కోర్సు

నిట్ లో ప్రత్యేక కోర్సు

నిట్ లో ప్రత్యేక కోర్సు
వరంగల్, జూన్ 28
ప్రతిష్టాత్మక విద్యాసంస్థ వరంగల్‌ నిట్ భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్‌లో కొత్తగా స్మార్ట్‌గ్రిడ్‌ టెక్నాలజీ కోర్సు అందుబాటులోకి రానుందని వరంగల్‌ నిట్‌ సంచాలకుడు ఆచార్య రమణారావు చెప్పారు.ఏబీబీ పవర్‌ గ్రిడ్‌ ఇండియా సంస్థ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్‌ల మధ్య జూన్ 25న పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరిందని ఆయన తెలిపారు.పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు పవర్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేలా అవసరమైన స్మార్ట్‌గ్రిడ్‌ను రూపొందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు. ఆన్‌లైన్‌లో ఒప్పంద పత్రాలపై ఏబీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.వేణు, ఎన్‌ఐటీ డైరెక్టర్‌ ఆచార్య ఎన్‌.వి.రమణారావు సంతకాలు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రోగ్రామ్‌ కార్యరూపం దాల్చనుంది.ఈ కార్యక్రమంలో నిట్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌.గోవర్ధన్‌రావు, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, ప్రొఫెసర్‌ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Related Posts