బాల్య వివాహాలను అడ్డుకోవాలి
హైదరాబాద్ జూన్ 28
ప్రస్తుత కోవిడ్- 19 మహమ్మారి సమయం నందు తెలంగాణ రాష్ట్రంలో అనేక బాల్య వివాహాలు జరిగినట్లు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి వచ్చినది. చైల్డ్ లైన్ సంస్థ గణాంకాల ప్రకారం 24.03.2020 నుండి 31.05.2020 వరకు మొత్తం(204) బాల్య వివాహాలు జరిగినట్లు సమాచారం. . దీని వలన బాలికల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కమిషన్ పరిగణిస్తుంది. బాల్య వివాహాలు వల్ల ముఖ్యంగా బాలికల ఆరోగ్యం, విద్యపై తీవ్ర ప్రభావం చూపిప్తుంది.ఈ విషయంలో బాల్య వివాహాల పరిరక్షణ అధికారులు, సంబంధిత అధికారులకు తగు సూచనలు ఇస్తూ బాల్య వివాహాలను నిరోధించడానికి చర్యలు తీసుకొవాలని తెలంగాణ రాష్టంలోని జిల్లా కలెక్టర్లను కమిషన్ కోరింది.