YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

కరోనా ఉగ్రరూపం; ప్రపంచవ్యాప్తంగా కోటి దాటిన  కేసులు.. 5 లక్షల మంది బలి

కరోనా ఉగ్రరూపం; ప్రపంచవ్యాప్తంగా కోటి దాటిన  కేసులు.. 5 లక్షల మంది బలి

కరోనా ఉగ్రరూపం; ప్రపంచవ్యాప్తంగా కోటి దాటిన  కేసులు.. 5 లక్షల మంది బలి
 జూన్ ౨౮, చైనాలోని వూహాన్‌ నగరంలో పుట్టిన  కరోనా వైరస్.. ఆపై 213 దేశాలకు విస్తరించింది. గతేడాది డిసెంబరు చివరిలో మొదలైన మహమ్మారి ఆరు నెలలుగా  చైనాలో తొలిసారి మొదలైన వైరస్ అన్ని ఖండాలకు విస్తరించింది. చైనా నుంచి తొలుత ఐరోపాకు చేరిన మహమ్మారి ఆ తర్వాత అమెరికాకు పాకింది. ఐరోపాలోని ఇటలీ, యూకే, స్పెయిన్ తదితర దేశాలను కరోనా వైరస్ వణికించింది. ఇటలీలోని వయోవృద్ధుల్లో దాదాపు 75 శాతం మందిని మహమ్మారి తుడిచిపెట్టేసింది. అగ్రరాజ్యాలుగా చెలామణి అవుతున్న దేశాలూ ఈ వైరస్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, అమెరికాను ఇంకా మహమ్మారి వదిలి పెట్టలేదు.  ప్రపంచవ్యాప్తంగా కోటి మందికిపైగా వైరస్ బారినపడ్డారు. వీరిలో ఐదు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 55 లక్షల మంది ఇప్పటి వరకూ కోలుకున్నారు. ఇంకా, 41 లక్షల మందిలో వైరస్ లక్షణాలు ఉండగా.. వీరిలో 57,748 మంది పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 26 లక్షలకు చేరువగా ఉంది. వీరిలో 128,152 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కరోనా వైరస్ కేసులు, మరణాలు చోటుచేసుకున్నాయి. అమెరికా తర్వాత బ్రెజిల్‌లో వైరస్ ఉద్ధృతంగా ఉంది. 13లక్షల మందికిపైగా వైరస్ బారినపడగా.. 57వేల మంది చనిపోయారు. అమెరికాలో సగటున రోజుకు 40 వేల మందికి వ్యాధి సోకుతుండగా, భారత్ సహా బ్రెజిల్, రష్యా, మెక్సికో, ఇరాన్, బంగ్లాదేశ్, చిలీ, పెరూ, పాకిస్థాన్ తదితర దేశాల్లో వైరస్ ప్రమాదకరంగా ఉంది. వైరస్ నుంచి దాదాపు బయటపడిందని భావించిన చైనాలో మరోసారి మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన వారం రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 1.80 లక్షలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. జూన్ 20న 1.57 లక్షలు, 21న 1.30 లక్షలు, 22న 1.39 లక్షలు, 23న 1.64 లక్షలు, 24న 1.73 లక్షలు, 25న 1.87 లక్షలు, 25న 1.94 లక్షల కేసులు నమోదయ్యాయి.

Related Posts