లక్ష్మీదేవి కటాక్షం కోసం
శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని మార్గాలను సూచిస్తున్నారు పెద్దలు
శ్రీఫలం
పేరులోనే ‘శ్రీ’ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేళం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ, ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి... ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని నిరంతరాయంగా పూజగదిలో ఉంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది కదా! ఏల్నాటిశనితో బాధపడుతున్న వారూ, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజగదిలో కానీ, క్యాష్బాక్సులో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతాయంటారు.
శ్రీసూక్తం
అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. వీటి మూలాలు రుగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీసూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి, వీటిని ఎవరి దగ్గరన్నా స్వరసహితంగా నేర్చుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడూ మోగుతుండేలా చూసినా శుభప్రదమే!
శ్రీచక్రం
తంత్రవిద్యలో శ్రీచక్రం/ శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తొమ్మిది త్రిభుజాలతో రూపొందించే ఈ చక్రం శివశక్తుల కలయికకూ, నవనాడులకూ చిహ్నమని చెబుతారు. అంతేకాదు ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికీ ఒకో మహత్తు ఉందని అంటారు. ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే ‘మేరు ప్రస్తారం’ అంటారు. ఈ మేరు ప్రస్తారాన్ని కానీ, శ్రీయంత్రాన్ని కానీ పూజగదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకం.
తామరపూలు
లక్ష్మీదేవి సముద్రమధనంలో ఆవిర్భవించిందని కదా పురాణాలు చెబుతున్నాయి! అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామరగింజలతో పూజిస్తే మంచిదని అంటారు. ఈ విషయంలో అంతగా స్పష్టత లేకపోయినప్పటికీ, లక్ష్మీదేవిని తామరపూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందన్నది పండితుల మాట. తామరపూలను నేతిలో ముంచి హోమంలో వేసినా, లక్ష్మీదేవి విగ్రహాన్ని తామరపూలతో పూజించినా శుభప్రదమే!
నేతిదీపాలు
చీకటిని అజ్ఞానానికీ, దారిద్ర్యానికీ, నిరాశకీ చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీకటిని పారద్రోలే సాధనం దీపం. ఇక నేతితో చేసిన దీపం పాడిపంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి. పాల నుంచి వెన్నను చిలికినట్లుగా, జీవితమనే మధనంలో తమకు విజయం చేకూరాలన్న కాంక్షను ప్రతిఫలిస్తాయి.
నమః సర్వ స్వరూపేచ నమః కళ్యాణదాయని
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
మహా భోగప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి
మహాసత్వ గుణే సంతే ధనదాయై నమోస్తుతే
శివరూపే శోవానందే కారణానంద విగ్రహే
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే
పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే
ధనసంపదనిచ్చే మంత్రం
కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః
(ఈ మంత్రాన్ని నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున 21రోజులు జపించాలి). ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియై నమః