YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

జీప్ ప్రయాణాలే దిక్కు

జీప్ ప్రయాణాలే దిక్కు

నష్టాల కారణంగా భీమ్‌గల్ డిపో ఎత్తివేయడంతో గిరి జన గ్రామాలకు రవాణా సౌకర్యం కొరవడింది. దాంతో గిరిజన గ్రామాలకు చెందిన ప్రజ లు ప్రమాదకరమని తెలిసినా ప్రైవేటు వాహ నాలపై ప్రయాణించక తప్పడం లేదు..పాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు ఏర్పాటైనా రవాణా వ్యవస్థలో మాత్రం మార్పు కనిపించడం లేదు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజల సౌలభ్యం కోసం అవసరమయ్యే బస్సులు ఏర్పాటు కాలేదు. ఆదాయ మార్గాలే లక్ష్యంగా బస్సులను నడుపుతూ పల్లె ప్రాంతాల ప్రజలను ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇచ్చి బస్సులు నడుపుతుండడంతో అటు పల్లె ప్రాంతాల ప్రయాణికులతోపాటు విద్యార్థులూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బస్సు వసతులు లేని కారణంగా ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశయ్రించాల్సి వస్తోంది. అధికారికంగా జిల్లాలోని 40 గ్రామాలకు మాత్రమే పలు కారణాలతో నడపడం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అంతకు రెట్టింపు స్థాయిలోనే గ్రామీణ ప్రాంతాలకు బస్సులను నడపడం లేదు. పలు గిరిజన తండాలు, శివారు ప్రాంతాలకు బస్సు వసతి కొరవడింది. జిల్లాలోని ఖిల్లాగణపురం మండలాన్నే పరిశీలిస్తే.. మండలంలో 19 గ్రామపంచాయతీలు, 24 తండాలు, పది శివారు గ్రామాలు-కాలనీలు ఉన్నాయి. వీటిలో కేవలం మూడు గ్రామాలకు మాత్రమే బస్సు వసతి ఉండడం గమనార్హం. జిల్లాకు చెందిన 116 బస్సులు, రోజూ 44వేల కి.మీ. ప్రయాణం చేస్తూ 35వేల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నా నేటికీ జిల్లాకు చెందిన ఎన్నో ప్రాంతాల ప్రజలకు బస్సు వసతి కల్పించలేకపోతున్నారు.మండల ంలోని రహత్‌నగర్, దేవక్కపేట్, గంగరాయి, తాళ్లపల్లి కారేపల్లి తదితర గిరిజన గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ఏదో బస్సును గిరిజన గ్రామాల మీదుగా వేములవాడ వరకు నడిపి ంచే వారు. దీంతో చేసేది లేక గిరిజనులు ప్రై వేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారుప్రమా దం అని తెలిసినప్పటికి తమ ప్రాణాలను అరచే తిలో పెట్టుకుని ప్రయాణించక తప్పడం లేదు. గతంలో రహత్‌నగర్ గండి ప్రాంతంలో ప్రైవే ట్ వాహనాలు ప్రమాదానికి గురై పలు వురు, గాయపడినప్పికి ప్రమాదమంచున ప్ర యాణించ తప్పడం లేదు. డిపో ఎత్తేసిన నాటి నుండి ఇదే పరిస్థితి ఉంది. తమ గ్రామాలకు ఆర్టీసి బస్సులను నడపాలని పలుమార్లు అధి కారులకు విన్నవించినా ఫలితం లేదని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆర్మూర్ డిపో నుండి బస్సులను నడ పాలని వారు కోరుతున్నారు.

Related Posts